పంజాబ్ లో పెను ప్రమాదం తప్పింది.కొంతమంది ఆగంతకులు రైల్వే ట్రాక్ పై ఇనుప రాడ్లను పెట్టారు. ఇది గమనించి వెంటనే అప్రమత్తమైన లోకోపైలెట్ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ ఘటన పంజాబ్ లోని భటిండాలో జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.