యూత్ యాక్టివిటీస్ లో భాగంగా పల్నాడు జిల్లా నరసరావుపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో బాల,బాలికలకు 200 మీటర్స్ పరుగు పందెం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నరసరావుపేట రోటరీ క్లబ్ ఆర్.ఎ.సి. చైర్మన్ రాయల శ్రీనివాసరావు,రోటరీ క్లబ్ న్యూ జనరేషన్ డైరెక్టర్,ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ షేక్ కరీం మొహిదీన్,కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి.నాగమల్లేశ్వరరావు,రోటరీ క్లబ్ అధ్యక్షులు కపిలవాయి రాజేంద్రప్రసాద్,సెక్రెటరీ సాతులూరి శివకుమార్,రోటరీ క్లబ్ పబ్లిక్ ఇమేజ్ డైరెక్టర్ ఎస్.కె.జిలానీ మాలిక్,ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ షేక్ మస్తాన్ షరీఫ్,కళాశాల చైర్మన్,నరసరావుపేట పురపాలక సంఘం మాజీ వైస్ చైర్మన్ షేక్ మీరవలి,పి.ఇ.టీ.లు హెచ్ గంగాధర్,సన్నీ,అథ్లెటిక్స్ కోచ్ సైదా రావు కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సంధర్బంగా వక్తలు మాట్లాడుతూ,రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో యూత్ ఆక్టివిటీస్లో భాగంగా అండర్-15,అండర్-17,అండర్-20 విభాగాలలో పరుగు పందెం నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున సర్టిఫికెట్,మెమొంటో అందజేస్తామని వెల్లడించారు.ఈ పోటీలలో నైపుణ్యం కనబర్చిన విద్యార్థులకు అందజేసే సర్టిఫికెట్లు భవిష్యత్తులో ఉన్నత చదువు,ఉద్యోగ అవకాశాలకు దోహద పడతాయని తెలిపారు.క్రీడల ద్వారా శారీరక,మానసిక ఉల్లాసం పెంపొందించుకోవచ్చనీ అన్నారు.గెలిచినవారు గర్వపడరాదని,ఓడినవారు నిరుత్సాహ పడరాదని పేర్కొన్నారు.గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని తెలిపారు.