Sunday, November 24, 2024
spot_img

ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్‌

Must Read
  • మొత్తం 600 పోలింగ్‌ కేంద్రాల్లో జరిగిన పోలింగ్‌
  • పోలింగ్‌ కేంద్రాల్లో బారులుతీరిన గ్రాడ్యుయేట్లు
  • సూర్యాపేటలో ఓటేసిన ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి

తెలంగాణలో వరంగల్‌ – నల్గొండ- ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్‌ ముగిసింది. మొత్తం 600 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్‌ జరిగింది. బరిలో 52 మంది అభ్యర్థులు ఉండగా.. మూడు పార్టీల మధ్య ప్రధాన పోటీ జరిగింది. కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ నుంచి ఏనుగుల రాకేష్‌, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి బరిలో ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ 49.53 శాతం పోలింగ్‌ నమోదైంది. మూడు ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలింగ్‌ జరిగింది. జూన్‌ 5వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ జరగనుంది. 4 గంటల లోపు పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్స్‌లను నల్లగొండ స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు వరంగల్‌ లో 30 శాతం పోలింగ్‌ నమోదైంది. జనగామ జిల్లాలో 28.38 శాతం, హనుమకొండ జిల్లాలో 32.90 శాతం, వరంగల్‌ జిల్లాలో 31.05 శాతం, మహబూబాబాద్‌ జిల్లాలో-28.49 శాతం, భూపాలపల్లి జిల్లాలో 27.69 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ములుగు జిల్లాలో 31.99 శాతం ఓటింగ్‌ నమోదైంది. మరోవైపు కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న, భార్యతో కలిసి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలోని పోలింగ్‌ బూత్‌ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం భువనగిరి జూనియర్‌ కళాశాలలో పోలింగ్‌ కేంద్రాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్‌ తో కలిసి సందర్శించారు. అటు హనుమకొండలోని పింగిలి జూనియర్‌ కళాశాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌ రెడ్డి ఓటేశారు. ఇటు నకిరేకల్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సతీ సమేతంగా నకిరేకల్‌ శాసనసభ్యులు వేముల వీరేశం ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్గొండ జిల్లా హాలియాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌. మరోవైపు.. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి, హుజూర్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి సైతం ఓటేశారు. హనుమకొండలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూడు జిల్లాల పరిధిలో ఈ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 600 పోలింగ్‌ బూత్‌ ల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 4లక్షల 63వేల 839 మంది ఓటర్లు ఉండగా.. అత్యధికంగా పురుష ఓటర్లే ఉన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో లక్షా 73వేల 406 మంది, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో లక్షా 23వేల 985 మంది, నల్గొండ ఉమ్మడి జిల్లాలో లక్షా 66వేల 448 మంది గ్రాడ్యుయేట్‌ ఓటర్లు ఉన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఖఖమ్మం నగరంలో 57 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. బ్యాలెట్‌ పద్ధతిలో ఎమ్మెల్సీ ఎన్నిక ప్రారంభం అయ్యింది. పోలింగ్‌ కోసం 129 బ్యాలెట్‌ బాక్సులను అధికారులు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, వెబ్‌ కాస్టింగ్‌తో పోలింగ్‌ పక్రియ నిర్వహిస్తున్నారు. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులు నల్గొండలోని స్ట్రాంగ్‌ రూంకు తరలింపునకు అధికారులు ఏర్నాట్లు చేసారు. 12 జిల్లాల్లో ఈ పోలింగ్‌ కొనసాగుతోంది. బ్యాలెట్‌ ద్వారా పట్టభద్రుల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం ఓటర్లు 4,63,839, 605 కాగా.. పోలింగ్‌ కేంద్రాలు, 807 బ్యాలెట్‌ బాక్సులున్నాయి. పురుష ఓటర్లు 2 లక్షల 88 వేల 189 మంది, మహిళలు లక్ష 75 వేల 645 మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు. ’ఖమ్మం – నల్లగొండ – వరంగల్‌’ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల దగ్గర బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్నారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోలైన ఓట్లను జూన్‌ 5న లెక్కించనున్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దాంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. బరిలో అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా రాకేశ్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్‌ రెడ్డి పోటీపడుతున్నారు. ఇదిలావుంటే బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, రాష్ట్ర మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలోని 457 నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లో ఆయన తొలి ఓటు వేశారు. ఈ పోలింగ్‌ బూత్‌ పరిధిలో మొత్తం 673 మంది ఓటర్లు ఉండగా.. పోలింగ్‌ ప్రారంభానికి ముందే బూత్‌కు వచ్చిన జగదీశ్‌ రెడ్డి తొలి ఓటు వేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో పోలైన ఓట్లను లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరుసటి రోజైన జూన్‌ 5న లెక్కించనున్నారు.

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS