- నిస్వార్థంతో చేసే సేవలు ఆదర్శనీయం
- అలాంటి వ్యక్తులు సమాజంలో కథా నాయకులే
- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- అవార్డులు అందుకున్న శివాని బజ్వ, అక్షాంశ్ యాదవ్, విభూతి అరోరా, శ్వేతా షా
నిస్వార్థంతో దేశానికి చేసే సేవలు ఆదర్శవంతమైనవని, అలాంటి వ్యక్తులు సమాజంలో ఎప్పటికీ కథా నాయకులేనని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. దేశానికి ఆదర్శప్రాయమైన వ్యక్తుల సేవలను గుర్తించి వారి సేవలకు గౌరవించాలనే చొరవతో “భారత్ కే అన్మోల్” అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం నాడు హైదరాబాద్ లోని హోటల్ తాజ్ డెక్కన్ లో డా.మహమ్మద్ నిజాముద్దీ న్ బృందం నేతృత్వంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సంస్థ సేవలను కొనియాడారు. దేశంలో విభిన్న రంగాల్లో ఆదర్శప్రాయమైన సేవలను అందించిన వ్యక్తులు, అధికారులకు భారత్ కే అన్మోల్ అవార్డులను మంత్రి శ్రీధర్ బాబు అందజేశారు. “భారత్ కే అన్మోల్” అవార్డు ప్రదానోత్సవం దేశానికి ఉజ్వల భవిష్యత్తును నిర్మించడంలో ఐక్యత, కరుణ, సామూహిక చర్య యొక్క శక్తికి నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. గత సంవత్సరం విజేతలు వారి అద్భుతమైన విజయాలతో తదుపరి తరానికి స్పూర్తినిస్తూ మార్గదర్శకులుగా పనిచేసేస్తారని తెలిపారు. “భారత్ కే అన్మోల్” అవార్డు ప్రదానోత్సవం ద్వారా, నిస్వార్థ రచనలు సమాజంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిన వారిపై దృష్టి సారించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. దేశం యొక్క అభివృద్ధి కోసం వారి విశేషమైన సేవకు కృతజ్ఞతలు, ప్రశంసలను తెలియజేయడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుంది అని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథి ఫీనిక్స్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ సురేష్ చుక్కపల్లి హాజరయ్యారు. అతిథులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్లపల్లి వెంకటేశ్వరరావు, మిస్ ఆసియా ఇంటర్నేషనల్, మిస్ ప్లానెట్ ఇండియా రష్మికపూర్ లు పాల్గొని అవార్డులను అందజేశారు. శివాని బజ్వ, అక్షాంశ్ యాదవ్, విభూతి అరోరా, శ్వేతా షా భారత్ కే అన్మోల్ అవార్డులను అందుకున్నారు.