( సెప్టెంబర్ 25 అంత్యోదయ దినోత్సవం సందర్భంగా )
సువిశాలమైన భారతదేశంలో లక్షలాదిమంది పేదలు నిరుపేదలు ఉన్నారు. వీరి జీవితాలను మెరుగుపరచడానికి అనేక సంస్కరణలు జరిగాయి. అలాంటి సంస్కరణలో ఒకటి అంత్యోదయ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పండితు దీన దయాళ్ కీలక పాత్ర నిర్వహించారు. అంత్యోదయ అంటే “చీకటి నుండి వెలుగుకు” అని అర్థం. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నివసించే పేద వెనుకబడిన ప్రజల ఆర్థిక సామాజిక స్థితిగతుల మెరుగుపరచడం లక్ష్యంగా ప్రారంభమైంది. భారతదేశంలోని అతి పేద మరియు అణగదొక్కబడిన వర్గాల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అంత్యోదయ దివాస్. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నివసించే పేద ప్రజలకు ఆర్థిక, సామాజిక మరియు మౌలిక సదుపాయాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలోని అతిపెద్ద వర్గాల సంక్షేమానికి అంకితమైన ఈ ప్రత్యేకమైన రోజు ఈ దినోత్సవం దేశంలోని పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి చేపట్టిన ప్రభుత్వ కార్యక్రమాలను ఒక గుర్తుగానే వస్తుంది. గ్రామీణ ప్రాంతాలలోని పేదరికాన్ని తగ్గించడం మరియు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం. గ్రామీణ ప్రజలకు స్వయం ఉపాధి కల్పించడం ద్వారా ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించడం. వెనుకబడిన వర్గాలను సాధికారత చేయడం మరియు వారి సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం. గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ముఖ్యంగా రహదారులు, నీటి సరఫరా, విద్యుత్తు మరియు ఆరోగ్య సౌకర్యాలు. అంతోదయ అన్న యోజన, దేశం యొక్క అతి పేద కుటుంబాలకు ఆహార ధాన్యాలను అందించడం. గ్రామీణ యువతకు వివిధ వృత్తులలో శిక్షణ ఇవ్వడం మరియు స్వయం ఉపాధి కల్పించడం. గ్రామీణ ప్రాంతాలలో కులదేవతలకు ఆలయాలను నిర్మించడం ద్వారా సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించడం. గ్రామీణ మహిళలను ఆర్థికంగా సాధికారత చేయడానికి ప్రత్యేక కార్యక్రమాలు.
అంతోదయ దివాస్ కార్యక్రమం భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో నివసించే పేద ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికై రోడ్లు విద్యుత్ నీరు వంటి మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణ ప్రాంతాల్లోని ఉసించే వారికి ఉచిత ఆరోగ్య పరీక్షలు మరియు చికిత్స, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పుస్తకాలు మరియు ఇతర అవసరమైన చదువుకునే వస్తు సామాగ్రిని అందించడం, దేశంలో పేదరిక నిర్మూలన లక్ష్యాన్ని సాధించడానికి ప్రజలను ప్రోత్సహించడం, దేశంలోని పేదరిక నిర్మూల లక్ష్యాన్ని సాధించడానికి అసమానతలు మరియు సంబంధిత సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం. ప్రభుత్వం ప్రవేట్ సంస్థలు మరియు సమాజసేవ సంస్థలను సహకారాన్ని పెంపొందించడం. ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది మంది పేద ప్రజలు ఆర్థికంగా స్వతంత్రులు అయ్యారు. అయితే, ఇంకా చాలా చేయవల్సి ఉంది.
భారతదేశం అభివృద్ధిలో పండిట్ దీన దయాళ్ అనన్యమైన ముద్ర వేశారు. ముఖ్యంగా దేశంలోనే పేదలు మరియు అనగా ద్రక్కబడిన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి అభినందనీయం. అంత్యోదయ అనే పదమే ఆయన జీవిత లక్ష్యాన్ని చూసిస్తుంది. అంత్యోదయ అంటే “పేదల ఉదయం” అని అర్థం ఇది కేవలం ఆర్థిక అభివృద్ధి మాత్రమే కాకుండా సామాజిక రాజకీయ మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిని కూడా సూచిస్తుంది. పండిత్ దీన్ దయాల్ గారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టారు. వ్యవసాయం గ్రామీణ పరిశ్రమలు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి అంటే అంశాలపై ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. దళిత సమాజం అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి అభినందనీయం. వారికి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. స్త్రీల సాధికారత కోసం అయినంతో కృషి చేశారు స్త్రీల విద్య ఆరోగ్యం ఆర్థిక సోలంబన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వివిధ కులాల మతాల మధ్య సామరస్యం పెంపొందించడానికి ఎంతో కృషి చేశారు. పండిట్ దీన దయాళ్ భారతదేశ అంత్యోదయ దివాస్ లో ఒక ప్రకాశమంతమైన నక్షత్రం ఆయన ఆదర్శాలు అనుసరిస్తూ మనం కూడా దేశాభివృద్ధిలో పాల్గొనాలి. సెప్టెంబర్ 25 దీన దయాళ్ జయంతిని భారత్ ప్రభుత్వం అంత్యోదయ దినోత్సవం గా ప్రకటించింది
కవి సాహితి విశ్లేషకులు
పూసపాటి వేదాద్రి.
9912197694