బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. బుధవారం అదిలాబాద్ జిల్లా బజార్హాత్నూర్లో 46, ములుగు జిల్లా ఏటూరునాగారంలో 123.3, సూర్యాపేట జిల్లా టేకుమట్లలో 56.5, వరంగల్ జిల్లా ఏనుగల్లో 45, కామారెడ్డి జిల్లా లింగంపేటలో 42.8 మి.మీ వర్షపాతం నమోదైంది.