Monday, September 30, 2024
spot_img

అస్సాం ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం,ధిక్కార నోటీసు జారీ

Must Read

బుల్డోజర్‎తో ఇళ్లను కూల్చివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అస్సాం ప్రభుత్వానికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. అస్సాంలోని కమృప్ జిల్లా కచుటోలి పత్తర్ గ్రామం పరిధిలో గిరిజన భూమిని ఆక్రమించి నిర్మించిన 47 ఇళ్లను అధికారులు ఇటీవల కూల్చివేశారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను అధికారులు ఉల్లఘించారని 47 మంది బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

బాధితులు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్‎లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ మేరకు కోర్టు ధిక్కార నోటీసు జారీచేసింది.

Latest News

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

తిరుమల లడ్డూ వివాదం పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ మేరకు లడ్డూ కల్తీ వ్యవహారం పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరువాదనలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS