Monday, April 7, 2025
spot_img

గోవా పర్యటకులకు గుడ్‎న్యూస్, అందుబాటులోకి కొత్త రైలు

Must Read

హైదరాబాద్ నుండి గోవా వెళ్ళే పర్యాటకులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. నగరం నుండి గోవా వెళ్ళే ప్రయాణీకుల కోసం కొత్త రైలు అందుబాటులోకి రానుంది. ఈ నెల 06న ప్రయోగాత్మకంగా ఈ రైలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఇక రెగ్యులర్ సర్వీస్ లు అక్టోబర్ 09న సికింద్రాబాద్ నుండి, వాస్కోడగామా నుంచి అక్టోబర్ 10న ప్రారంభమవుతాయని వెల్లడించింది. సికింద్రాబాద్-వాస్కోడగామా ( 17039 ) రైలు ప్రతి బుధ, శుక్రవారం, వాస్కోడగామా – సికింద్రాబాద్ ( 17040 ) రైలు ప్రతి గురు , శనివారం బయల్దేరుతాయని తెలిపింది.

ప్రస్తుతం రెగ్యులర్ ట్రెయిన్ సికింద్రాబాద్‌-వాస్కోడగామా మధ్య వారంలో నాలుగు రోజులు మాత్రమే నడుస్తోంది. రైలు ( 17063 ) మంగళ, బుధ, శుక్ర, ఆది వారాల్లో అందుబాటులో ఉంటుంది. కానీ ఈ ట్రైన్ కి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో కిటకిటలాడుతుంది. హైదరాబాద్‌ నుంచి వాస్కోడగామాకు మరో రైలు (17021) ఉంది. ఇది అదివారం రోజే నడుస్తోంది. ఈ మార్గంలో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మరో కొత్త రైలును ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS