Thursday, November 14, 2024
spot_img

రాష్ట్రానికి గుర్తింపు తెచ్చేలా కొత్త క్రీడా విధానం తయారు చేయాలి

Must Read
  • సీఎం రేవంత్ రెడ్డి

అద్భుతమైన క్రీడాకారులను తీర్చిదిద్దటంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త క్రీడా విధానం తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. 2036 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని కొత్త పాలసీలో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అన్నారు. కొత్త స్పోర్ట్ పాలసీ ముసాయిదాపై సీఎం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు , ఏపీ జితేందర్ రెడ్డి , తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి , ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ సంధర్బంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను ప్రధానంగా చర్చించి పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెలకొల్పనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీని యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని పీపీపీ తరహాలో నిర్వహించాలని ఆదేశించారు. ఈ యూనివర్సిటీలో క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్‌, బాస్కెట్ బాల్, స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, అక్వాటిక్స్ లాంటి 14 క్రీడలను స్పోర్ట్స్ హబ్‌లో చేర్చాలని సూచించారు.

Latest News

దాడి చేసినోళ్ల పాపం పండింది

రైతుల మాటున అధికారులపైదాడి చేసినోళ్ల పాపం పండిందిచెట్లు పేరు చెప్పి కాయలు అమ్ముకునుడు అంటే ఇదే కావొచ్చు..ప్రజలకు సేవ చేద్దామని పెద్ద చదువులు వెయ్యి చేసుకోడానికి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS