Thursday, November 14, 2024
spot_img

తెలంగాణ భవిష్యత్తులో ఇంజనీర్లదే కీలక పాత్ర

Must Read
  • ఎవరు అడ్డొచ్చిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కొనసాగుతుంది
  • నిర్వాసితుల కోసం 07 వేల కోట్లు అప్పు చేశాం
  • మరో 10 వేల కోట్లు అప్పు చేస్తాం
  • నిర్వాసితులను ఆదుకునేందుకు విపక్ష పార్టీ నేతలు సలహాలు ఇవ్వాలి
  • సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ భవిష్యత్తులో ఇంజనీర్లదే కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో ప్రభుత్వ ఉద్యోగం పొందిన 1473 మంది ఇంజనీర్లకు నియామకపత్రాలు అందించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, టెక్నాలజీ లేని సమయంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్లు నిర్మించామని తెలిపారు. 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డును నూతన ఇంజనీర్లే నిర్మించబోతున్నారని పేర్కొన్నారు. ఎవరు అడ్డొచ్చిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిర్వాసితుల కోసం 07 వేల కోట్లు అప్పు చేశామని, మరో 10 వేల కోట్లు అప్పు చేస్తామని అన్నారు. నిర్వాసితులను ఆదుకునేందుకు విపక్ష పార్టీ నేతలు సలహాలు ఇవ్వాలని కోరారు. మూసీ రివర్ ను ఎందుకు అభివృద్ది చేసుకోవద్దని ప్రశ్నించారు.

పదేళ్ళ పాలనలో ఎప్పుడైన మాజీ సీఎం కేసీఆర్ సచివాలయనికి వచ్చారా అని ప్రశ్నించారు. వందలాది మంది విద్యార్థులు ఆత్మబలీదానాలు చేసుకుంటేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని అన్నారు. తాను చేపట్టిన ” విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ ” కు మీరంతా నిరుద్యోగులు మద్దతు ఇచ్చారు అని పేర్కొన్నారు. గత కొన్ని ఏళ్లుగా నియామకాలు లేక నిరుద్యోగ యువత నిరాశ చెందారని అన్నారు.

Latest News

గ్రూప్ 03 పరీక్షకు జిల్లావ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశాం

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ టీజీపీఎస్సీ ప్రతిపాదించిన ప్రతి సూచనను అధికారులు తప్పకుండా పాటించాలి 33 పరీక్షా కేంద్రాల్లో 9,478, మందికి గ్రూప్ 3 పరీక్ష నిర్వహణ, అభ్యర్థులు ఉదయం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS