- వీఎల్ఎఫ్ ఏర్పాటుకు వికారాబాద్ జిల్లా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం
- కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తూ వివాదాలకు తెరలేపుతున్నారు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో భారత నేవీకి సంబంధించిన రాడార్ కేంద్రానికి మంగళవారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు బండిసంజయ్, కిషన్ రెడ్డి, తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ , నేవీ అధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, దేశ రక్షణ పరికరాల తయారీలో హైదరాబాద్ నగరానికి మంచి పేరుందని అన్నారు. దేశ భద్రత విషయంలో హైదరాబాద్ వ్యూహాత్మక ప్రాంతమని తెలిపారు. వీఎల్ఎఫ్ ఏర్పాటుకు వికారాబాద్ జిల్లా అత్యంత వ్యూహాత్మక ప్రాంతమని, కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తూ వివాదాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయనివ్వమని పేర్కొన్నారు.