- సోనియా గాంధీకు రాష్ట్ర అవతరణ వేడుకలకు వచ్చే అర్హత ఉంది : విజయశాంతి
- ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన సోనియాను ఉద్యమకారులు గుర్తుపెట్టుకుంటారు
- రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసిన కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటుకే మొగ్గు చూపింది
- కాంగ్రెస్ ను ప్రశ్నించే అర్హత కిషన్ రెడ్డికు లేదు
- కిషన్ రెడ్డి కామెంట్స్ కు విజయశాంతి కౌంటర్
కాంగ్రెస్ ను ప్రశ్నించే అర్హత కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేదని అన్నారు కాంగ్రెస్ నేత విజయశాంతి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు రావాలని మంగళవారం కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించిన విషయం తెలిసిందే. జూన్ 02న జరిగే ప్రభుత్వ కార్యక్రమానికి (రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు) రాజకీయ నేత సోనియా గాంధీని ఎలా ఆహ్వానిస్తారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏంతో మంది బలిదానాలకు సోనియానే కారణమంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు. కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ కు విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. సోనియా గాంధీకి రాష్ట్ర అవతరణ వేడుకలకు వచ్చే అర్హత ఉందని, తెలంగాణ ఏర్పాటుకు కారణమైన సోనియా గాంధీని ఉద్యమకారులు ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటారని తెలిపారు. ఆనాడు తెలంగాణ బాధ్యతను బీజేపీ తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుంటుందని తెలిసిన తెలంగాణ ఏర్పాటుకే మొగ్గు చూపారని గుర్తుచేశారు .కిషన్ రెడ్డికి కాంగ్రెస్ ను ప్రశ్నించే అర్హత లేదని మండిపడ్డారు.