- మహారాష్ట్ర , జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
- నవంబర్ 20న మహారాష్ట్రలో సింగిల్ ఫేజ్ లో అసెంబ్లీ ఎన్నికలు
- జార్ఖండ్ లో రెండు విడతాల్లో ఎన్నికలు
- నవంబర్ 13న తొలి విడత, 20న రెండో విడత ఎన్నికలు
- నవంబర్ 23న రెండు రాష్ట్రాల కౌంటింగ్
దేశంలోని రెండు రాష్ట్రాలలో ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర , జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 20న మహారాష్ట్రలో సింగిల్ ఫేజ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్ లో రెండు విడతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 13న తొలి విడత, 20న రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబర్ 23న రెండు రాష్ట్రాలకు సంబంధించిన కౌంటింగ్ చేపట్టనున్నారు. నవంబర్ 26తో మహారాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ముగుస్తుంది. జార్ఖండ్ లో జనవరి 05, 2025 తో కాలపరిమితి ముగుస్తుంది.
మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు ఉండగా,9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. జార్ఖండ్ లో 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.