Friday, September 20, 2024
spot_img

1200 మంది ఫోన్లు ట్యాపింగ్‌ చేశాం..

Must Read

సంచలన విషయాలు బయపెట్టిన ప్రణీత్‌ రావు

  • విచారణ జరుగుతున్నా కొద్దీ వెలుగులోకి కీలక విషయాలు
  • ప్రతిపక్ష నేతలతో పాటు జడ్జిల ఫోన్లను సైతం
    మొత్తంగా 1200 మంది ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు వెల్లడి
  • ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా కోట్లాది రూపాయలు స్వాధీనం చేసుకున్నాం
  • ధ్వంసం చేసిన పెన్‌ డ్రైవ్‌ లను బేగంపేట్‌ నాలాలో , హార్డ్‌ డిస్క్లను మూసినదిలో పడేశాం
  • వాంగ్మూలంలో కీలక విషయాలను బయటపెట్టిన ప్రణీత్‌ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుగుతున్నా కొద్దీ కీలక విషయాలను రాబడుతున్నారు అధికారులు. తాజాగా ప్రణీత్ రావు వాంగ్మూలంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతిపక్ష నేతల ఫోన్లతో పాటు వారి కుటుంబసభ్యుల ఫోన్లు ,మీడియా పెద్దల ఫోన్లు,జర్నలిస్టుల ఫోన్లు , రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు,వ్యాపారవేత్తలఫోన్లు,ప్రతిపక్ష నాయకులకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లతో పాటు జడ్జిల ఫోన్లను ఇలా మొత్తంగా 1200మంది ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు ప్రణీత్ రావు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌ల కోసం “కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్” సహాయం తీసుకోని , శ్రీనివాస్, అనంత్‌ల సహాయంతో ఫోన్ ట్యాపింగ్ చేశామని వెల్లడించారు. 8 ఫోన్ల ద్వారా సిబ్బందితో టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేవాళ్లమని తన వాంగ్మూలంలో తెలిపారు. తమకు అధికారికంగా మూడు ఫోన్లు కేటాయించి, అనధికారికంగా ఐదు ఫోన్లను కేటాయించారని వెల్లడించారు.ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలకు ఆర్థికంగా సహాయం చేస్తున్న వారి పై నిఘా ఉంచి కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టుకున్న డబ్బు మొత్తాన్ని ఎవరికీ అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించామని ప్రణీతరావు పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ట్యాపింగ్ కు సంబందించిన అన్ని ఆదారాలను ధ్వంసం చేసి ఫోన్ ట్యాపింగ్ ను ఆపేశామని తెలిపారు. ధ్వంసం చేసిన పెన్ డ్రైవ్ లను బేగంపేట్ నాలాలో , హార్డ్ డిస్కులను మూసారాంబాగ్ లోని మూసి నదిలో పడేశామని తన వాంగ్మూలంలో వెల్లడించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This