Sunday, November 24, 2024
spot_img

ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది : కేటీఆర్

Must Read
  • రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా.? లేనట్టా.?
  • కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు మొదలయ్యాయి
  • విత్తనాల పంపిణి ప్రక్రియను పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ.?
  • సాగునీరు ఇవ్వడం చేతకాక పంటలను ఎండగొట్టారు
  • ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా
  • రైతుల సంగతిశక్తిలో ఉన్న బలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చవి చూడక తప్పదు
  • కాంగ్రెస్ పాలనా పై ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం.

రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎదురుకుంటున్న సమస్యలపై ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఓ వీడియో ను పోస్ట్ చేశారు.విత్తనాల పంపిణి ప్రక్రియను పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడున్నారని, ముందుచూపులేని ముఖ్యమంత్రి జాడేదని ప్రశ్నించారు. ధాన్యం అమ్ముదాం అంటే కొనేవాడు లేక, విత్తనాలు కొందామంటే అమ్మేవాడు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. సాగునీరు ఇవ్వడం చేతకాక పంటలను ఎండగొట్టారని, ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 10 నిమిషాల్లో విత్తనాలు అందించామని, ప్రస్తుతం 10 గంటలపాటు పడిగాపులు పడిన అందించలేరా అంటూ ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలని కేటీఆర్ ప్రశ్నించారు. రంగారెడ్డి నుంచి కామారెడ్డి వరకు రైతులకు కష్టాలు తప్పడం లేదని, ఇంకెన్నాళ్ళపాటు ఈ కన్నీళ్లు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలోని ప్రజల కడుపు నింపే స్థాయికి తెలంగాణ కానీ ప్రస్తుతం అన్నదాతకే తిండితిప్పలు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. సరిపడా విత్తనాల స్టాక్ తెప్పించి, బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా కళ్లెం వేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రైతులకు అరిగోస పెట్టకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సంగతిశక్తిలో ఉన్న బలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చవి చూడక తప్పదని తన ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు కేటీఆర్.

Latest News

ప్రజాస్వామ్య మనుగడకు వెన్నెముక..రాజ్యాంగం

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దశ, దిశా,నిర్దేశాలు, విధి విధానాలు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, హక్కుల గురించి తెలియజేసే లిఖిత మైన మహత్తర గ్రంథమే భారత...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS