- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పనులు చేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని రైల్ నిలయంలో రైల్వే జీఎం అరుణ్‌కుమార్ తో ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సంధర్బంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ,గతంలో ఎప్పుడులేని విధంగా దక్షిణ మధ్య రైల్వే బడ్జెట్‌ను పెంచామని అన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తంగా 05 వందే భారత్ రైళ్లు ఉన్నాయని వెల్లడించారు. యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ సర్వీసును విస్తరించాల్సి ఉందని,దీనికి రూ.650 కోట్లు అవసరం అన్నారు. త్వరలో వరంగల్‌లో రూ.650 కోట్లతో రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఏర్పాటు కానుందని అన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ రూ.430 కోట్లతో పూర్తయిందని వెల్లడించారు.