Friday, September 20, 2024
spot_img

కల్తీ ఫుడ్ తో పరేషాన్

Must Read
  • కంపు కొడ్తున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు కానరారు
  • హైదరాబాదీ బిర్యానీ అంటే లొట్టలేసుకోవాల్సిందే
  • తెలంగాణకు మారుపేరు బిర్యానీ అంటూ ఊదర గొడ్తారు
  • ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్న సినీ, రాజకీయ ప్రముఖులు
  • బిర్యానీలో బల్లిపడ్డ, ఫుడ్ లో పురుగులొచ్చిన లైట్ తీసుకుంటున్న వైనం
  • సికింద్రాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో బల్లి వస్తే సీజ్.. గంటకే రీఓపెన్
  • ప్రభుత్వాలు మారినప్పుడు హోటళ్లపై రైడ్స్
  • మిగతా రోజుల్లో ప్రజల ఆరోగ్యాలకు ఎవరూ గ్యారెంటీ

హైదరాబాద్, తెలంగాణ అంటే బిర్యానీకి మారు పేరు అని ఊదరగొడ్తారు రాజకీయ నాయకులు. సినీ, పొలిటికల్ పెద్దలు హైదరాబాద్ కు వచ్చి తిని చూడు నాన్ వెజ్ అంటే ఏంటో తెలుస్తది అంటూ గప్ఫాలు కొడతారు. స్టార్ హోటల్స్, గ్రాండ్ హోటల్స్, రెస్టారెంట్స్ వంటివి మా దగ్గర బోలెడు పలానా దాంట్లో బిర్యానీ తిను ఎప్పటికీ మరచిపోలేవు. హైదరాబాదీ బిర్యానీ రుచి చూడంది క్రికెటర్లు పోరు.. హైదరాబాదీ బిర్యానీ గల్ఫ్ దేశాలకు, ఫారెన్ కంట్రీస్ కు టన్నుల కొద్దీ సప్లై అవుద్దీ. ఏమనుకున్నావ్ మా స్పెషల్ అంటే ఈ మాత్రం ఉండాలె అంటూ గొప్పలు చెప్పే వారు లేకపోలేరు. నిజంగా ఇంత గ్రేట్ గా చెబుతున్నప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులేంటి.. వాళ్లు చెబుతున్న విషయాలేంటి.. టీవీలు, పేపర్లలో గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలేంటి.. ఆ కథ కమామిషు మీకోసం…

హైదరాబాద్ బిర్యానీ అంటే అహో.. ఓహో అంటూ లొట్టలేసుకుంటూ తినే ఆహార ప్రియులకు ఆహార భద్రతా అధికారులు షాక్ ఇస్తున్నారు. బయట ఫుడ్ తినే ముందు ఓ సారి ఆలోచించండి. ఫుట్ పాత్ ఫుడ్ సహా ప్రముఖ హోటల్స్ లో మీరు తింటున్న బిర్యానీలు, నాన్ వెజ్ అంతా వేస్ట్. పాడైపోయిన చికెన్, మటన్, కుళ్లిపోయిన కూరగాయాలు, పురుగులు పట్టిన బియ్యం, ఇతర సామాగ్రి, కంపు కొడ్తున్న కిచెన్ లో తయారవుతున్న బిర్యానీ, ఇతర మాంసాహార ఆహారం తీసుకొని శరీరానికి రోగాలు కొనితెచ్చుకోకుర్రి అని హెచ్చరిస్తున్నారు. వారం పది రోజులుగా ఎక్కడ చూసిన ఫుడ్ స్టేఫ్టీ అధికారుల దాడులు, హోటల్స్ పై రైడ్స్.. పలానా రెస్టారెంట్ సీజ్.. కేసులు బుక్ అయినయి అనే మాటలే వినిపిస్తున్నయి. నిజంగానే నక్షత్ర హోటల్స్ నుంచి రోడ్డు పైన ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వరకు అన్ని కల్తీ ఆహారమే. బియ్యం సహా చికెన్, మటన్, ఫిష్ వంటివి నాణ్యతలేనివి, మిగిలిపోయినవే ఎక్కువ వాడడం జరుగుతుంది. ఇదీ నిన్న, ఇయ్యాలా జరిగేది కాదు.. తరతరాలుగా వస్తున్నది. కానీ పాలకులు, అధికారులు మారినప్పుడు మాత్రం అక్కడక్కడ దాడులు చేస్తూ హోటల్స్ యాజమాన్యాలను బెదిరిస్తూ మాముళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నయి.

ఫుడ్ సేప్టి అధికారుల చర్యలేవి :

ఏడాదంతా ఇదే తంతు సాగుతుంటే ఫుడ్ సేప్టి అధికారులు మాత్రం అమ్యామ్యాలు లెక్కపెడుతున్నారు. ప్రముఖ హోటల్స్ పై అనేక కంప్లైంట్ లు వచ్చిన వాళ్లు ఏం చేయలేకపోతున్నారు. రాజకీయ ఒత్తిడిలా, పై అధికారుల ఆదేశాలా తెల్వదు గానీ బిర్యానీలో బల్లి వచ్చినా, ఫుడ్ లో పురుగులు ఉన్నా.. కస్టమర్ కంప్లైంట్ చేస్తే కనీసం స్పందనే ఉండదు. ఆరు నెలల క్రితం సికింద్రాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో బిర్యానీ ఆర్డర్ చేస్తే దాంట్లో బల్లి వచ్చిందని ఓ వ్యక్తి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేస్తే.. వచ్చి అదీ పరిశీలించి నామ మాత్రంగా కేసు నమోదు చేసి, సీజ్ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ గంటలోపే అదే హోటల్ తిరిగి ఓపెన్ చేసి మళ్లీ యథావిధిగా వ్యాపారం కొనసాగించడంపై పలు అనుమానాలు తలెత్తాయి. అసలు ఆ హోటల్ పై చర్యలు తీసుకున్నారా అని కూడా తెల్వదు. పలుకుబడి ఉపయోగించి స్టార్ హోటల్స్ ఫుడ్ లో నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదని తెలుస్తోంది.

పాలకులు మారినప్పుడేనా :

హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ నగరాలు, పట్టణాల్లో ప్రముఖ హోటల్స్, బిర్యానీ హౌజ్ లలో ఎప్పటికీ ఏదో ఒక కంప్లైంట్ లు వస్తూనే ఉంటాయి. అయినా ఫుడ్ సేఫ్టీ అధికారులు తూతూ మంత్రంగా దాడులు చేసి వదిలేస్తారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా స్టార్ హోటల్స్ వంటి వాటిపై కూడా తనిఖీలు చేసే ఆహార భద్రతా సిబ్బంది మిగతా 365 రోజులు ఎందుకు నజర్ పెట్టరనేది వెయ్యి డాలర్ల ప్రశ్న. ప్రజల ప్రాణాలు అంటే అంత చులకనా అనే భావన కలుగక మానదు. నెలనెలా వాళ్లకు కూడా ఆయా హోటల్స్, రెస్టారెంట్ల నుంచి మాముళ్లు వస్తాయి కాబట్టే వాళ్లు సైలెంట్ మోడ్ లో ఉంటారనే ప్రచారం ఉంది. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో రెండు, మూడు సార్లు తెలంగాణ వ్యాప్తంగా విస్తృత రైడ్స్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ తర్వాత ఎందుకు కామ్ అయ్యారో అర్థం కానీ పరిస్థితి. మళ్లా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దాడులు షురూ చేసిర్రు. ఇదే పొడుగూత కంటిన్యూ చేస్తరా అంటే అదీ ఉండదు. వాళ్ల టార్గెట్ అంతా ఫైస్టార్, పెద్ద పెద్ద రెస్టారెంట్, దాబాలు, గ్రాండ్ హోటల్స్ వంటి వాటినీ తమ గుప్పిట్లో పెట్టుకోవడమే అనే ఆరోపణలు వస్తున్నయి. నిజంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని నక్షత్ర హోటల్స్, రెస్టారెంట్, దాబాలు, పెద్ద పెద్ద టిఫిన్, భోజన హోటల్స్ పై చర్యలు తీసుకుంటారా అంటే అదీ ఉండదు.

జిల్లాల్లోనూ ఇదే తంతు :
తెలంగాణలోని వరంగల్, హన్మకొండ, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లా కేంద్రాలు వాటి చుట్టూ ఉండే పెద్ద పట్టణాలలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్లు, దాబాలలో బిర్యానీలు, నాన్ వెజ్ లో ఏ రకంగా ఉన్నాయి.. వారు ఆహార భద్రత ప్రమాణాలు పాటిస్తున్నారా.. నాణ్యత లోపించిందా అని ఫుడ్ సేఫ్టీ అధికారులు అడపదడపా తనిఖీలు చేస్తున్నారూ తప్ప మిగతా రోజుల్లో పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కేవలం పాలకులు, అధికారులు మాత్రం వీటిని మేనేజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోకపోవడం అధికారులు మాముళ్లు తీసుకొని తూతూ మంత్రంగా వదిలేయడమే ఇందుకు కారణం. కుళ్లిపోయిన చికెన్, మటన్, ఫిష్, రైస్ లో నాణ్యత లేకపోవడం, కూరగాయలు ఇతరత్రా ఇంగ్రిడియన్స్ కూడా లోకల్ వి వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కనీసం కిచెన్ లో శుభ్రత లేకపోవడం.. కుకింగ్ చేసేవారు సహాయకులు సైతం నీట్ నెస్ గా లేక పోవడంతో ఫుడ్ పాయిజన్ అయి అనేకచోట్ల అస్వస్థతతోపాటు కొందరూ చనిపోయిన ఘటనలు ఉన్నాయి. అయినా ఇప్పుడు కొత్తగా ఆహార భద్రతా అధికారులు తనిఖీలు చేస్తూ నామ మాత్రంగా కేసులు బుక్ చేస్తున్నట్లు మీడియాలో షో చేయడం చూస్తే సిగ్గుకే సిగ్గేస్తుంది.

ఇకనైన పాలకులు సొంత లాభం కోసం కాకుండా నిజంగా ప్రజా ఆరోగ్యం కోసం పాటుపడండి.. మన హైదరాబాద్, తెలంగాణ పేరు దేశమే కాదు యావత్ ప్రపంచంలో గొప్పగా చెప్పుకుంటారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This