సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. శనివారం సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది.
ములుగు జిల్లాలో సమక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీకి ఎకరానికి రూ.250 చొప్పున భూమి కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఆప్‌గ్రేడ్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ కు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
రేరాలో 54 ఉద్యోగాలు భర్తీ చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఆదేశించింది. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ భూమి బాదలాయించాలని కేబినెట్ నిర్ణయించింది.
మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తా చెప్పింది. పెండింగ్ లో ఉన్న రెండు డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఒక డీఏ వచ్చే నెల జీతంతో, మరో డీఏ మార్చిలో ఇవ్వాలని నిర్ణయించింది.
మెట్రో రైలు మార్గాల విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నాగోల్ – ఎల్బీ నగర్ – హయాత్ నగర్, ఎల్బీనగర్ – శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోను విస్తరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.