Friday, September 20, 2024
spot_img

రాష్ట్రంలో కేసీఆర్ మాఫియా నడిపారు : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

Must Read
  • ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు
  • ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి కూడా బాధితుడిడే
  • వెంటనే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకు అప్పగించాలి
  • సీఎం రేవంత్ రెడ్డి పై ఢిల్లీ పెద్దల ఒత్తిడి ఉంది..
  • ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై బిజెపి ఆధ్వర్యంలో ధర్నా

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితుడిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా హైదరాబాద్ లోని ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టారు.ఈ సందర్బంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కేవలం రాజకీయ లబ్ది కోసమే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారని అన్నారు. ప్రతిపక్షా నాయకుల ఫోన్లతో పాటు జడ్జిలా ఫోన్లను కూడా ట్యాప్ చేశారని తెలిపారు. అయితే ఈ వ్యవహారంలో బాధితుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.వెంటనే ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు.విచారణలో భాగంగా ఎన్నో కీలక విషయాలు బయటికి వస్తున్నా రేవంత్ రెడ్డి మాత్రం ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో మాఫియా నడిపారని దుయ్యబట్టారు.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలైన నిందితులను పట్టుకునే ప్రయత్నం చేయట్లేదని అన్నారు.తప్పు చేస్తే ఎంతటి వారికైనా జైలుకు పంపిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై ఇన్ని సంచలాత్మక విషయాలు బయటికి వస్తున్నా చర్యలు తీసుకోకుండా మౌనం వహిస్తున్నారని , అధిష్టానానికి లొంగిపోయారా.? అని ప్రశ్నించారు.రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దల ఒత్తిడి ఉందని ఆరోపించారు.వెంటనే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులు, పాత్ర దారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు , ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Latest News

బీఆర్‌ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This