- ఆ రాత్రి జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఏం జరిగింది.!
- గతంలో నార్కో టెస్ట్ అడిగితే హాజరుకాని వైనం
- ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్న జన్వాడ డ్రగ్ పార్టీ
- బామ్మర్ది ఆధ్వర్యంలో జన్వాడ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ
- కొకైన్ సహా డ్రగ్స్ వాడినట్లు పుకార్లు
- విదేశీ మద్యం పెద్ద ఎత్తున స్వాధీనం
- రాజ్ పాకాల ద్వారా కేటీ రామారావు సీక్రెట్స్ బయటకి.?
- తమదైన శైలీలో ప్రశ్నిస్తున్న పోలీసులు
- విజయ్ మద్దూరి మళ్లీ రూట్ మార్చడంలో ఆంతర్యమేంటి
కత్తి పట్టిన వాడు అదే కత్తితో మరణిస్తాడని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడు ఈ సామెత కల్వకుంట్ల తారక రామారావుకు కరెక్ట్ గా సూట్ అయ్యేట్టు కొడుతుంది. గతంలో కేటీఆర్ పైన అనేక ఆరోపణలు వచ్చాయి. కేటీఆర్ కు పబ్బులు, క్లబ్ లకు అమ్మాయిలతో తిరిగే అలవాటుందని, సెలబ్రెటీలు, హీరోయిన్లతో కలిసి డ్రగ్స్ తీసుకొని ఎంజాయ్ చేస్తాడంటూ గత ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ పలుమార్లు ఆరోపించారు. అంతేకాదు డ్రగ్ టెస్ట్ కు రావాలంటూ రేవంత్, బండి ఇద్దరూ కేటీఆర్ కు సవాల్ కూడా విసిరారు. కానీ అప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి వాళ్ల మాటలను లెక్కపెట్టలేదు. కానీ ఇప్పుడు ఆయన మెడకు అదే డ్రగ్ కేసు చుట్టుకునే ప్రమాదం లేకపోలేదు. తాజాగా జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకొని తాగి తందనాలు ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. జన్వాడ ఫామ్ హౌస్ లో సైబరాబాద్ ఎస్ వోటీ పోలీసులు దాడులు చేశారు. అక్కడకు వెళ్లిన పోలీసులకు విస్తుపోయే దృశ్యాలు వాళ్ల కళ్లతో చూడాల్సి వచ్చింది. పెద్ద ఎత్తున అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి రేవ్ పార్టీ చేసుకుంటున్నట్లు గమనించారు. క్యాసినో, క్రిప్టో కరెన్సీ వంటివి కూడా ఆడుతున్నట్లు తేలింది. డబ్బులు కాకుండా కాయిన్స్, ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ విధానంలో పేకాట ఆడుతున్నట్లు పోలీసులు చూసినట్లు తెలిసింది. ఇందులో ప్రధాన కీలక భూమిక పోషించినది మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల. గమ్మత్తు ఎంటంటే పోలీసుల రాకను ముందే పసిగట్టిన ఇతగాడు అక్కడ్నుంచి పరారు అయ్యాడు.
గత శనివారం రాత్రి 11.30గం.ల ప్రాంతంలో ఫామ్ హౌస్ కు పోలీసులు వెళ్లగా పార్టీలో మహిళలు, పురుషులు కలిసి మద్యం తాగుతూ డ్యాన్స్ చేస్తున్నట్లు గుర్తించారు. భారీ శబ్దాలతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 21 మంది పురుషులు, 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 35 మందితో నిర్వాహకులు మధ్యం పార్టీ నిర్వహించారు. డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. రాజ్ పాఠాల స్నేహితుడు విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు నిర్ధారించారు. విదేశీ మాదక ద్రవ్యాలతో పాటు, ఫారెన్ లిక్కర్, కొకైన్ వంటి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో పోలీసులకు చిక్కిన వారిలో విజయ్ మద్దూరి కీలక విషయాలు వెల్లడించారు. కాగా కేసులో నిందితుడైన విజయ్ మద్దూరి ఇంట్లో మోకిల పోలీసులు ఆదివారం సోదాలు చేపట్టారు. సోమవారం విచారణకు విజయ్ హాజరుకాలేదు. పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు.
ఈ కేసులో కొకైన్ పాజిటివ్ వచ్చిన విజయ్ మద్దూరికి సంబంధించిన డ్రగ్ టెస్ట్ కిట్ తోపాటు ఆయన ఫోన్ ను సీజ్ చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అయితే ఆ పార్టీలో పాల్గొన్న ఓ మహిళ తన ఫోన్ సీజ్ చేశారని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేసుకున్నారు. కేసు కోర్టు పరిధిలోకి ఉన్నందున కోర్టు అనుమతి తర్వాత ఫోన్ ను తిరిగిస్తామని వెల్లడించారు. విజయ్ ను అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన తన ఫోన్ కు బదులు పక్కన ఉన్న మహిళ ఫోన్ ను ఇచ్చారు. విజయ్ మద్దూరి సెల్ ఫోన్ సీజ్ చేసేందుకు పోలీసులు వచ్చినట్లు సమాచారం. కాగా, అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారనే కారణంతో రాజ్ పాకాల (51)తోపాటు, కొకైన్ తీసుకున్నట్టు నిర్ధారణ అయిన విజయ్ మద్దూరి (56)పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి విజయ్ మద్దూరికి 41 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు ఇచ్చి, స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు. విచారణ నిమిత్తం సోమవారం పోలీసెస్టేషన్ కు రావాలని వారు సూచించినా.. ఆయన సాయంత్రం వరకు కూడా స్టేషన్ కు రాలేదు. శనివారం రాత్రి పార్టీ నుంచి వెళ్లిపోయిన రాజ్ పాకాల అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మోకిల పోలీసులు సోమవారం దర్యాప్తు కోసం రాయదుర్గంలోని రాజ్ పాకాల నివాసానికి నోటీసులు అతికించారు. కాగా ఆయనకు హైకోర్టుకు వెళ్లి విచారణకు రెండ్రోజులు టైం తీసుకున్నాడు.
జన్వాడ ఫామ్స్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల మోకిల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. న్యాయవాదితో పాటు ఆయన విచారణకు వచ్చారు. నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ ఆధ్వర్యంలో విచారణ సాగింది. ఎన్టీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగానే రాజ్ పాఠాలకు నోటీసులు ఇచ్చారు. అందులో భాగంగా బుధవారం రాజ్ పాకాలను విచారించారు. ఇదీలా ఉండగా ఈ నైట్ పార్టీలో కేటీఆర్ సతీమణి శైలీమా కూడా ఉన్నట్లు ప్రచారం అయింది. కానీ ఈ దావత్ లో కేటీఆర్ పాల్గొన్నాడా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. అయినప్పటికీ శైలీమా పేరు బయటకు రావడమే ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోయారు. ఇదంతా కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల చేతుల మీదుగానే జరిగినట్లు సమాచారం. అయితే దీని వెనుక ఎవరెవరూ ఉన్నారు.. ఈ పార్టీలో పాల్గొన్న ప్రముఖులు ఎవరూ అన్నది తేలాల్సి ఉంది.
దీనిపైన స్పందించిన కేటీఆర్ మాత్రం ఎవరి ఇంట్లో వారు పండగ చేసుకుంటే కూడా పర్మిషన్ తీసుకోవాలా.. పార్టీ చేసుకుంటే తప్పేంటి అంటూ ఎదురుదాడికి దిగాడు. దొంగ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు కల్వకుంట్ల తారకరామారావు ఎందుకు అలా మాట్లాడాడు.. అని అందరికీ అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే జన్వాడ ఫామ్ హౌస్ లో ఏం జరిగింది.. సీసీ టీవీ వీడియో ఫుటేజ్ బయటపెట్టాలి.. కేటీఆర్, ఆయన భార్య శైలీమాకు డ్రగ్ టెస్ట్ చేయాలంటూ బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీపావళిలోపు బాంబ్ లు పేలబోతున్నాయి. బీఆర్ఎస్ వాళ్లూ అరెస్ట్ అవుతారనే ఉద్దేశంతో మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే కేటీఆరేనా ఆ బాంబ్ అని తెలంగాణ ప్రజలకు అనుమానాలు రేకెత్తుతున్నాయి.