Friday, August 29, 2025
spot_img

ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరిస్తారా

Must Read
  • ప్రజాపాలన అంటే ప్రతిపక్షం గొంతు నొక్కడమా?
  • శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులపై కేసులు దారుణం
  • ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హరీష్‌ రావు

ప్రజాపాలన అంటే ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనా అని సిద్దిపేట బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు (Harish Rao) ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులకు కేసులు కొత్త కాదని, ఎన్ని బెదిరింపులకు పాల్పడినా, అక్రమ కేసులు పెట్టినా ప్రజల తరుపున ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. తమ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తోపాటు బీఆర్‌ఎస్‌ నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని హరీశ్‌ రావు తీవ్రంగా ఖండించారు. పేదల ఇండ్లు ఎందుకు కూలగొట్టారని ప్రశ్నించినందుకు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం హేయమైన చర్య అని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తనపై తన కుటుంబ సభ్యులతోపాటు పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టినంత మాత్రానా భయపడేది లేదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. హన్వాడ మండల కేంద్రంలో 60, 70 మంది బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టేందుకు జాబితాలు సిద్ధం చేసినట్టు తెలిసిందని ఏ ఒక్కరూ భయపడవద్దని మీకు అండగా మేమున్నామని భరోసా ఇచ్చారు. వరద భాస్కర్‌ ఇంటికి పోతే అతనిని పోలీస్‌ వాళ్లు కొట్టారని బాధపడితే అడుగుదామని పోతే సీఐ లేరంటే కింద కూర్చున్నాం.. దానికి కూడా కేసు నమోదు చేసారా అంటూ ప్రశ్నించారు. కూలగొట్టిన దివ్యాంగుల ఇండ్లను కట్టివ్వమని కోరినం అదికూడా తప్పా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అప్పన్నపల్లి బ్రిడ్జి నిర్మాణం రెండేండ్లలో పూర్తి చేశాం, పేదలకు మెరుగైన వైద్యం అందించాలని పెద్ద దవాఖాన నిర్మాణం చేశాం. వీటిపై అసత్య ప్రచారాలతో ఎన్నికల్లో ఓడించారు. ఇప్పటికీ అదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూలు అమలు చేయకుండా.. పేదల పక్షాన అడుగుతున్న వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమాల్లో అనేక కేసులు నమోదు చేసినా జంకలేదు. ఇప్పుడు మీరు పెట్టే కేసులకు బెదిరిపోతామా.. మీ బండారాన్ని బయటపెట్టేందుకు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజలకు వివరిస్తామన్నారు. వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని అధికారులు, పోలీసులు కూడా గుర్తెరిగి ప్రవర్తించాలని ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు.

Latest News

రాష్ట్రంలో వరదలపై సీఎం రేవంత్ సమీక్ష

సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం తెలంగాణలో పలు జిల్లాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS