- బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటాం.: బీసీ జనసభ రాష్ట్రఅధ్యక్షుడు రాజారాం యాదవ్
- కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీలను మోసం చేయడానికి సిద్ధమైంది
- బీసీ డిక్లరేషన్ కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలి
- జూన్ 8న మహాధర్నా, 15న సెక్రటేరియట్ ముట్టడికి రాజారాం యాదవ్ పిలుపు
- కరీంనగర్ మీడియా సమావేశంలో బీసీ జనసభ, బీసీ సంఘాల అల్టిమేటం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్.గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో బిసి సంఘం రాష్ట్ర నాయకుడు గుంజపడుగు హరిప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశనికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సంధర్బంగా రాజరాం యాదవ్ మాట్లాడుతూ కులగణన, సామాజిక న్యాయం పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందిన కాంగ్రెస్ మరోసారి బీసీలను మోసం చేసేందుకు సిద్ధమైందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి విజయభేరీ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్ కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తే.. దాదాపు 23 వేల పైచిలుకు మంది ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. .లోక్ సభ ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కుట్ర చేస్తున్నారని , ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చేశారని గుర్తుచేశారు.అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక మాట, తర్వాత మరో మాట మాట్లాడటం..రేవంత్ రెడ్డి రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, కులగణన బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కులగణన నిర్వహించి, దేశానికి ఆదర్శంగా నిలిచిన బీహార్ రాష్ట్రాన్ని మోడల్ గా తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. దశాబ్దాల సామాజిక వర్గాల న్యాయమైన డిమాండ్ సాధన కోసం తెలంగాణ తరహా మరో పోరాటానికి అంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం కులాలు, పార్టీలకు అతీతంగా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని ఫూలే యునైటెడ్ ఫోరమ్ రాష్ట్ర నాయకులు గుంజెపడుగు హరిప్రసాద్ అన్నారు. అలాగే.. బీసీ జనసభ తలపెట్టిన జూన్ 8న మహాధర్నా, 15న సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు సత్యం యాదవ్, గౌడ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు పోన్నం అనిల్ గౌడ్, రాష్ట్ర గౌడ్ సంఘం మహిళ కన్వీనర్ పూదరి రాజేశ్వరి గౌడ్, పద్మశాలి సంఘం నాయకులు కట్ట ఆనందం, వోడ్నాల రాజు, మున్నూరుకాపు సంఘం నాయకులు వరాల శ్రీనివాస్, రజక సంఘం నాయకులు జక్కనపెళ్లి శంకర్, బీసీ సంఘాల నాయకులు కడారి ఐలయ్య, తుల భాస్కర్ రావు, చల్లోజి రాజు, గుడిసెల రమేష్ గౌడ్, కాల్వ మల్లేశం యాదవ్, సందబోయిన గీతాంజలి, గాలి రవీ యాదవ్, అడ్వాకేట్ జేఏసీ రాష్ట్ర నాయకులు లొడంగి గోవర్ధన్, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు