Friday, November 22, 2024
spot_img

చదువుతోనే మార్పు సాధ్యం : పులి దేవేందర్ ముదిరాజ్

Must Read

సమాజ మార్పు జరగాలన్న , కుటుంబ ఆర్థిక అభివృద్ధి జరగాలన్న ఆయా కుటుంబాల్లోని పిల్లలు ఉన్నత చదువులు చదవాలని ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ అన్నారు.మెపా ఆధ్వర్యంలో గత నెల రోజులుగా నిర్వహించిన మెపా సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమం నక్కలగుట్టలోని వివేకానంద పాఠశాల లో నిర్వహించడం జరిగింది.ఈ సంధర్బంగా పులి దేవేందర్ మాట్లాడుతూ విద్యతో ఏదైనా సాధించవచ్చు అని తెలిపారు. ముదిరాజ్ కుటుంబాల్లో ఎక్కువ శాతం మంది ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే చదువు ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అలాంటి వారికీ మెపా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.రానున్న కాలంలో మెపా ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి శిబిరలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.మెపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమ్మర్ క్యాంపుకు విద్యార్థులను పంపించి వారి అభ్యున్నతికి, శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.నెలరోజుల పాటు విద్యార్థుల కోసం సుదురా ప్రాంతాల నుండి వచ్చి విద్యార్థులకు వివిధ అంశాలు బోదించిన గురువులకు ధన్యవాదములు తెలిపారు.సమ్మర్ క్యాంపు నిర్వహణకు తమ పాఠశాలలో అవకాశం కల్పించిన వివేకానంద పాఠశాల కరస్పాండెంట్, కార్యక్రమ ముఖ్య అధితి పాక వెంకటేశ్వర్లు సార్ కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథి పాక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ .. సమాజ సేవ చేయడం గొప్ప విషయం అన్నారు. మెపా కు ఎల్లపుడు తమ సహకారం ఉంటుందని తెలిపారు.పిల్లలు బాగా చదువుకుని సమాజ సేవకులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మెపా రాష్ట్ర కమిటీ కార్యదర్శులు నీరటి రాజు ముదిరాజ్, సింగారపు రామకృష్ణ ముదిరాజ్ , దండు చిరంజీవి ముదిరాజ్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు నూనె శివకుమార్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి అమ్మగారి శ్యాం సుందర్, వినోద్, పులి లావణ్య, హనుమకొండ గౌరవ అధ్యక్షులు రావుల రానాప్రతాప్, ములుగు జిల్లా కన్వీనర్ అచ్చునూరి కిషన్, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు పులి సదానందం,శిబిరంలో బోదించిన ఉపాధ్యాయులు ధర్మదేవ్,కుక్కల శ్రీనివాస్,శీలం నీరజ,రాము,రవళి,రణధీర్, నాగేశ్వరావు,నీలం శ్రీధర్ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభాకర్,సంపత్, తిరుపతి, సురేష్,కుమారస్వామి, సుభాష్,విద్యార్థులు పాల్గొన్నారు.

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS