Thursday, November 14, 2024
spot_img

మున్సిపల్‌ అనుమతులా..? మాకవసరం లేదు..

Must Read
  • అక్రమ నిర్మాణాలకు ఆలవాలంగా మారిన బొల్లారం మున్సిపాలిటీ..
  • ఈ నిర్మాణాలను కూల్చివేయడానికి వెనకడుగు వేస్తున్న కమిషనర్‌..
  • ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న కేటుగాళ్లు..
  • మున్సిపాలిటీలో గ్రామ పంచాయితీ అనుమతులంటూ కలరింగ్‌..
  • కాసులకు కక్కుర్తి పడి బోగస్‌ పీ.టీ.ఐ.ఎన్‌. నెంబర్లను సృష్టించిన వైనం ..
  • బోగస్‌ నెంబర్లను అధికారులు నిర్దారణ చేసి, క్యాన్సల్‌ చేసినా అగని నిర్మాణ పనులు..
  • గతంలో కూల్చివేసినా.. తిరిగి యదేచ్చగా వెలిసిన నిర్మాణాలు..
  • అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని వెల్లువెత్తుతున్న డిమాండ్స్‌..
  • సీ.డి.ఎం.ఏ. కమిషనర్‌.. జర దేఖో ఇదర్‌..

అది అక్రమమని తెలుసు.. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నామని తెలుసు.. అన్నీ తెలిసినా అక్రమ నిర్మాణదారులు నిస్సిగ్గుగా పేట్రేగిపోతున్నారు.. తప్పని తెలిసినా ఏమీ కాదనే ధైర్యంతో కొందరు అవినీతి అధికారులను లంచాలతో మేనేజ్‌ చేస్తున్నారు.. తమ కార్యకలాపాలను నిర్విఘ్నంగా సాగిస్తున్నారు.. డబ్బులు కొడితే ఏదైనా సాధ్యం అవుతుందని నిరూపిస్తున్న దారుణం బొల్లారం గ్రామ శివారులో సాగుతోంది.. మరి ఎందుకు అధికారులు ఉపేక్షిస్తున్నారో ఈపాటికే మీకు అర్ధం అయ్యి ఉంటుంది.. అంతా డబ్బు మహిమ.. అధికారులను, ప్రభుత్వాలను చివరకు న్యాయాన్ని సైతం కొనొచ్చు అనే కండకావరం.. అసలు విషయానికి వస్తే..

సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలం బొల్లారం గ్రామ శివారులో సర్వేనెంబర్‌ 75 లో పెట్రేగిపోతున్న అక్రమార్కులు… ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొట్టి యదేచ్ఛగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ విల్లాల నిర్మాణాలు చేపట్టారు కేటుగాళ్లు.. అధికారం అడ్డుపెట్టుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ.. బోగస్‌ పత్రాలు సృష్టించి గ్రామ పంచాయితీ అనుమతులు ఉన్నాయంటూ దొడ్డి దారిన నిర్మాణాలు పూర్తి చేసి మున్సిపల్‌ చట్ట నిబంధనలకు తూట్లు పొడిచారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు గతంలో యదేచ్ఛగా ప్రభుత్వం నుండి ఎలాంటి నిర్మాణ అనుమతులు లేకుండా విళ్లాల నిర్మాణం చేపడితే కూల్చివేశారనడంలో ఎలాంటి సందేహం లేదు.. బోగస్‌ ఇంటి నెంబర్లను సృష్టించిన విషయం అధికారులకు తెలిసిన నేటికీ అక్రమ విల్లాలను కూల్చివేయకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. బొల్లారం మున్సిపాలిటీ కమిషనర్‌ లెటర్‌ నెంబర్‌ ఏ/103/2024, తేది:- 19-07-2024 గల లేఖ ద్వారా సిడిఎంఏ కమిషనర్‌ కు తెలిపిన నేటికీ అక్రమ విల్లాలను కూల్చకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు పలువురు సామాజిక వేత్తలు..అక్రమ నిర్మాణాల పై సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ చర్యలు చేపట్టిన.. బొల్లారం లో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ నిర్మిస్తున్న నిర్మాణాల పై దృష్టి సారించక పోవడం అధికారుల అవినీతికి అద్దం పడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి..అధికారులు నిర్మాణాలను తేది :- 17-01-2024 రోజున కూల్చివేసిన మరల నిర్మాణాలు వెలువడంతో అమాయక ప్రజలు నష్ట పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పలువురు మేధావులు.. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అధికారుల పనితీరు చట్టబద్ధంగా ఉండాలని ప్రజలకు పారదర్శకంగా పనిచేసినట్టు ఉండాలని చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయానా తెలిపిన విషయం విధితమే.. ముఖ్యమంత్రి మాటలను సైతం బేఖాతరు చేస్తూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో లాగా ఏది చేసిన అది చెల్లుబాటు అవుతుంది అన్నట్టుగా ఉంది అక్రమా విల్లాల వ్యవహారం..గ్రామ పంచాయతీ అనుమతులు ఉన్నాయని బోగస్‌ ఇంటి నెంబర్లతో దొడ్డి దారిన పొందిన పిటిఐఎన్‌ నెంబర్లను అధికారులు రద్దు చేసిన.. కొనుగులు దారులకు బురిడీ కొట్టిస్తు సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు నిర్మాణ దారులు.. మార్పు దిశగా పాలన చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేసి, చట్టాలు పారదర్శకంగా అమలు అవుతున్నాయని ప్రజలకు జవాబుదారితనంగా ఈ ప్రభుత్వం పని చేస్తుందని గురుతర బాధ్యతలను అధికారులు గుర్తుపెట్టుకుని ఆ దిశగా అక్రమ నిర్మాణాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్‌ వెల్లువెత్తుతున్నాయి..సీడీఎంఏ కమిషనర్‌ జేర బొల్లారం మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాల పై దృష్టి సారిస్తే అమాయకులు మోసపోకుండా ఉంటారని పలువురు సామాజిక వేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు..

బొల్లారం మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలకు సంబంధించి మరిన్ని ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది ‘‘ ఆదాబ్‌ హైదరాబాద్‌’’.. ‘‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘‘

Latest News

గ్రూప్ 03 పరీక్షకు జిల్లావ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశాం

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ టీజీపీఎస్సీ ప్రతిపాదించిన ప్రతి సూచనను అధికారులు తప్పకుండా పాటించాలి 33 పరీక్షా కేంద్రాల్లో 9,478, మందికి గ్రూప్ 3 పరీక్ష నిర్వహణ, అభ్యర్థులు ఉదయం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS