సన్ ఫిస్ట్ తన బ్రాండైన ” హర్ టిఫిన్ కి స్వీట్ ఎండింగ్’’లో షారుక్ ఖాన్ నటించిన క్యాంపెయిన్‌ను ఆవిష్కరించింది.ఈ సందర్బంగా ఐటీసీ బిస్కెట్స్ &కేక్స్ క్లస్టర్, ఫుడ్స్ డివిజన్చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అలీ హ్యారిస్ షేర్ మాట్లాడుతూ భోజనం తర్వాత స్వీట్స్, డెసర్ట్ లను తరచుగా తీసుకుంటున్నట్టు గుర్తించిన నేపథ్యంలో సన్ ఫిస్ట్ ద్వారా ఈ నూతన టీవీసిను తీసుకువచ్చామని తెలిపారు. టీవీసీ లో సినిమా పేజీల నుంచి ఫ్యాన్ పేజీల వరకు ఫరా ఖాన్ కుందర్, తారుక్ రైనా వంటి సెలబ్రిటీలు, స్టార్ షెఫ్సంజ్యోత్ ఖీర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ షెహజాన్ ఖాన్, అలాగే ఇన్ఫ్లుయెన్సర్ ఆర్యన్ కటారియా సైతం ‘‘షారుక్ ఖాన్ టిఫిన్‌లో ఏముంది’’ అనే విషయాన్ని తెలుసుకోవాలన్న తమ తీవ్ర ఆకాంక్షను సోషల్ మీడియాలో వ్యక్తం చేసి షేర్ చేశారని గుర్తుచేశారు. సలాడ్ల నుంచి బిర్యానీ వరకు ఇలా చాలా ఊహాగానాలు ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టాయని, చివరికి చాలా మంది భారతీయుల్లగానే తాను కూడా టిఫిన్‌లో తియ్యదనం అంటే ఇష్టపడతానని ఎస్ఆర్కే ఎట్టకేలకు వెల్లడించిందని తెలిపారు. అలాగే తన టిఫిన్‌లో తనకు ఎంతో ఇష్టమైన సన్ ఫీస్ట్ డార్క్ ఫాంటసీ కుకీలను వెంట తీసుకొనివెళ్తానంటూ అన్నారని తెలిపారు.కరిగిన మోల్టెన్ చాకోక్రీమ్తో నిండి ఉన్న సన్ ఫీస్ట్ డార్క్ ఫాంటసీ కుకీ లను భోజనం తర్వాత తినేందుకు సరైన డెసర్ట్ అన్నారు. భోజనం చేసిన తర్వాత నోరు తీపి చేసుకోవడాన్ని అందరూ ఇష్టపడతారన్న విషయాన్ని గుర్తిస్తూ, టిఫిన్ అనుభూతిని పెంచే వినూత్న అవకాశాన్నిసన్ ఫీస్ట్ డార్క్ ఫాంటసీ దక్కించుకుందని బెంగళూరుకు చెందిన ఎఫ్‌సీబీ ఉల్కా ప్రెసిడెంట్ & ఆఫీస్ హెడ్ ఎం. దామోదరన్ తెలిపారు.