- ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా
అసెంబ్లీకి వెళ్లని వైసీపీ ఎమ్మెల్యేలు తక్షణమే తమ పదవులకు రాజీనామ చేయాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా అన్నారు. మంగళవారం విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలు వైసీపీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను గమనించే 11 సీట్లు ఇచ్చారని తెలిపారు. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం అయిన స్వయంకృతాపరాధమేనని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలు జగన్కు ఎమ్మెల్యేగా గెలిపించారని, వారి తరుపున పొరడాల్సిన బాధ్యత జగన్ కి లేదా అని ప్రశ్నించారు. వైసీపీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చిన కృతజ్ఞతనైనా ఉండాలి కదా అంటూ నిలదీశారు. ఇంట్లో కూర్చొని మాట్లాడతం కాదు, అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరుపున మాట్లాడాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని అన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే వైసీపీ ఎమ్మెల్యేలు కనీసం హాజరుకాలేదని మండిపడ్డారు.