Thursday, November 14, 2024
spot_img

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

Must Read

తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‎పై విచారణ ముగిసింది. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‎పై వాదనలు విన్న సీజే ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. భారాస పార్టీ తరుపున సీనియర్ న్యాయవాది మోహన్ రావు వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదన్నారు. అసెంబ్లీ స్పీకర్ పక్షాన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం, విచారణ ముగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తీర్పును రిజర్వు చేసింది.

బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‎కు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Latest News

గ్రూప్ 03 పరీక్షకు జిల్లావ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశాం

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ టీజీపీఎస్సీ ప్రతిపాదించిన ప్రతి సూచనను అధికారులు తప్పకుండా పాటించాలి 33 పరీక్షా కేంద్రాల్లో 9,478, మందికి గ్రూప్ 3 పరీక్ష నిర్వహణ, అభ్యర్థులు ఉదయం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS