రైతులు ఆరుగాలం చెమటోడ్చి పండించిన ధాన్యం కొనమంటూ మిల్లర్లు చేతులేత్తేస్తే?
వ్యవసాయ,పౌర సరఫరా శాఖలు ఉదాసీనతతో ధాన్యం కొనుగోళ్లు అడుగు ముందుకు సాగడం లేదు.
అకాల వర్షాల గోసకు పాలకుల నిర్లక్ష్యంతోడై ధాన్యం కొనుగోళ్లు జరగక కల్లాలల్లో అల్లాడుతున్న రైతాంగం..
రైతులను కష్టపెడితే కఠిన చర్యలు అంటూ.. పండిన ప్రతి గింజను కొంటామంటూ మాటల తూటాలు కాదు!
కొనుగోలు వేగవంతం చేయాలి..
ప్రకృతి,పాలకులు పగబడితే పట్టేడన్నం పెట్టి రైతు దుఃఖం జాతికి అరిష్టం..
అనైతిక రాజకీయ కొట్లాట వీడి రైతు కన్నీరు తుడవండి..
- మేదాజీ