Tuesday, November 26, 2024
spot_img

ఆదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలి

Must Read
  • రాష్ట్ర ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్

ఆదానీపై కేసు పెట్టాలని ఎన్నిసార్లు కోరిన ప్రధాని మోదీ పట్టించుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదానీ వ్యవహారంపై శుక్రవారం తెలంగాణ భవన్‎లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా ఆదానీ వ్యవహారం మళ్లీ బయటపడిందని తెలిపారు. తెలంగాణలో ఆదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆదానీ తెలంగాణకి రాలేదని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఆదానీతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని తెలిపారు.

రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే ఆదానీతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర వెళ్ళి ఆదానీని గజదొంగ అన్న సీఎం రేవంత్ రెడ్డి..తెలంగాణలో మాత్రం గజమాల వేస్తున్నారు..ఆదానీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై బిజెపి పార్టీ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బడే భాయి మోదీ ఆదేశాలను..చోటే భాయి రేవంత్ రెడ్డి అమలు చేశారని అన్నారు.

ఆదానీతో దేశానికి నష్టమైతే తెలంగాణకి నష్టం కాదా.. ఆదానీ కోట్ల ఒప్పందాలపై విమర్శించే రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆదానీతో కెన్యా లాంటి చిన్న దేశాలే ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి..సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చేసుకోరు అని ప్రశ్నించారు.

Latest News

డీప్ ఫేక్ సాఫ్ట్ వేర్‎తో కొంతపుంతలు తొక్కుతున్న సైబర్ దొంగలు

ఆన్‎లైన్ స్కాంలు చేయడంలో కొత్త పుంతలు తొక్కుతూ ఎంతో కొంత డిజిటల్ జ్ఞానం ఉన్నవారిని సైతం బురిడి కొట్టిస్తున్నారు సైబర్ మోసగాళ్ళు. డీప్ ఫేక్ అనే...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS