బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు మరో 11 మంది పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఉదయం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.రేవంత్ రెడ్డి వెంట పొంగులేటి శ్రీనివాస్,ఇతర కాంగ్రెస్ ముఖ్యనాయకులు కూడా ఉన్నారు.తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితిల పై పోచారం శ్రీనివాస్ తో కలిసి రేవంత్ రెడ్డి చర్చించారు.ఆ తర్వాత తనయుడుతో కలిసి పోచారం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
పోచారం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడంతో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్,మన్నే గోవర్ధన్,గేల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు మరికొంతమంది నాయకులు నిరసన తెలుపుతూ పోచారం శ్రీనివాస్ నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించారు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.బాల్క సుమన్ తో పాటు మరో 11 మంది పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.బాల్క సుమన్,గేల్లు శ్రీనివాస్ యాదవ్,మన్నే గోవర్ధన్,ఆంజనేయ గౌడ్,కడారి స్వామి యాదవ్, బాలు,రాజు,జంగయ్య ,వాసు,దశరథ్,బాలరాజు యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.అనంతరం కోర్టులో హాజరుపరిచారు.కోర్టుకి తరలిస్తున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.