Friday, September 20, 2024
spot_img

ఏవోల్ మూవీ కి సెన్సార్ నుంచి ఎ సర్టిఫికెట్

Must Read

ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ కొత్తగా ఉండి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటే నెత్తిన పెట్టేసుకుంటున్నారు. అందుకే దర్శకనిర్మాతలు కూడా కొత్తదనం ఉండేలా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమమంలోనే ఒక ఆసక్తికరమైన సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు హీరోలుగా జెనిఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటించిన సినిమా ఏవోల్ (లవ్) ని రివర్స్లో చూస్తే ఈవిఓఎల్ అని ఈ సినిమా కూడా ఒక రివర్స్ లవ్ స్టోరీగా మన ముందుకు రాబోతుందని వెల్లడించారు ప్రొడ్యూసర్ డైరెక్టర్ రామ్ యోగి వెలగపూడి. రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తోంది.

ఎవోల్ డిఫరెంట్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా వివరాలను శుక్రవారం ప్రసాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించిన పత్రిక సమావేశంలో దర్శక నిర్మాత రామ్‌ యోగి వెలగపూడి పాల్గొని మాట్లాడుతూ..

తేడా బ్యాచ్‌ సినిమా సమర్పణలో నక్షత్ర ఫిల్మ్‌ ల్యాబ్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉందన్నారు. ఇద్దరు స్నేహితుల మధ్య అండర్‌స్టాండింగ్‌, నేపథ్యంలో సాగే కథ అని. సినిమా డిఫరెంట్‌ అంశాలు, వాణిజ్య విలువలతో క్రైమ్‌ థ్రిల్లర్‌గా. రూపొందిందని ఆధ్యంతం ఉత్కంఠగా సాగుతుంది. ఈ చిత్రాన్ని హైదరాబాద్‌, వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం అని అన్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This