Thursday, November 21, 2024
spot_img

ప్రైవేట్‌ వ్యక్తి పెత్తనం..?

Must Read
  • మైనార్టీ గురుకులాల్లో శ్రీనివాస్‌ లీలలు
  • అర్హత లేకున్నా అకాడమిక్‌ హెడ్‌గా
    అధికారం చెలాయింపు..
  • రెగ్యూలర్‌ ఉద్యోగులపై జులూం..
  • చక్రం తిప్పుతున్న ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయ్‌
  • కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు,205 స్కూల్స్‌లో
    పెత్తనం చెలాయింపు..
  • ప్రభుత్వం మారినా.. మారని సోసైటీల దుస్థితి

తెలంగాణలోని మైనార్టీ గురుకులాల్లో ఓ ప్రైవేటు వ్యక్తి పెత్తనం కొనసాగుతుంది. రాష్ట్రంలోని 205 మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌కు అన్ని తానై వ్యవహరిస్తున్నాడు. అకాడమిక్‌ హెడ్‌గా కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేస్తున్నాడు. మైనార్టీ గురుకులాల్లోని వేలాది మంది రెగ్యూలర్‌ ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పర్మినెంట్‌ ఉద్యోగులపై ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయ్‌ పెత్తనం చెలాయిస్తూ..ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయని చెబుతూ జులూం ప్రదర్శిస్తున్నాడు. ప్రభుత్వాలు, పాలకులు మారిన కానీ మైనార్టీ గురుకులాల దుస్థితి మాత్రం మారడం లేదు. విద్యార్థులకు సరైన విద్య అందించేందుకు టీచర్లు పడుతున్న బాధలను ఏ మాత్రం అర్థం చేసుకోకుండా వారినీ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి.గతంలో మైనార్టీ గురుకులాల సెక్రటరీగా షఫీ ఉల్లా ట్రాన్స్‌ ఫర్‌ అనంతరం వచ్చిన అయోషా మషరత్‌ ఖానం విజిలెన్స్‌,ఎస్‌ఆర్పీలను తొలగించారు.

అర్హత లేకున్నా అకాడమిక్‌ హెడ్‌ :

టీఎంఆర్‌ఈఐఎస్‌లో అకాడమిక్‌ హెడ్‌గా శ్రీనివాస్‌ కొలువు చేస్తూ అధికారం చలాయిస్తున్నాడు. కేంద్ర కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తూ తెలంగాణలోని అన్ని మైనార్టీ గురుకులాల్లో పనిచేస్తున్న టీచింగ్‌,నాన్‌ టీచింగ్‌ స్టాప్‌పై జులూం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. మిగతా సోసైటీలతో పోల్చితే మైనార్టీ సోసైటీలో రూల్స్‌ భిన్నంగా ఉన్నాయి.స్కూల్స్‌ టైమింగ్స్‌ సహా మరిన్ని కండిషన్స్‌ పెడుతూ ఉద్యోగులను టార్చర్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి అకాడమిక్‌ హెడ్‌ అనే హోదాలో ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 205 స్కూల్స్‌ ను నడిపించాలంటే టీచింగ్‌ ఫీల్డ్‌లో అనుభవం ఉండాలి. కానీ కనీసం బీఈడీ వంటి ఎడ్యూకేషన్‌ క్వాలిఫికేషన్స్‌ పెద్దగా లేకున్నా కూడా శ్రీనివాస్‌ను అకాడమిక్‌ హెడ్‌గా నియమించడంపై మొదటి నుంచి విమర్శలు వస్తున్నాయి. ఆయన నియామకం,క్వాలిఫికేషన్స్‌,ఎక్స్‌పీరియన్స్‌కు సంబంధించిన వివరాలేవి ఎవరికీ తెలియక పోవడం విడ్డూరంగా ఉంది. మైనార్టీ శాఖలో ఉన్న పెద్దసార్ల ఆశీస్సులతోనే అకాడమిక్‌ హెడ్‌గా పెత్తనం చెలాయిస్తున్నాడు.

మరోవైపు గతంలో మైనార్టీ గురుకులాల్లో తొలగించిన విజిలెన్స్‌, ఎస్‌ఆర్పీలను ఇప్పుడు…శ్రీనివాస్‌ మళ్ళీ ఆ రిక్రూట్మెంట్‌ చేసేందుకు ఫైల్‌ మూమెంట్‌ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అకాడమిక్‌ హెడ్‌ పేరుతో మైనార్టీల ఎన్నో అవినీతి, అవకతవకలు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని అన్ని స్కూల్స్‌ టీచర్లు,ప్రిన్సిపాల్స్‌పై శీనివాస్‌ జులూం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి అయి ఉండి కూడా తమపై ఇలా దురుసుగా ప్రవర్తించడంతో తట్టుకోలేకపోతున్నామని వారు వాపోతున్నారు.
అధ్వాన్నంగా మైనార్టీ గురుకులాలు..

మైనార్టీ గురుకుల విద్య మిథ్యగా తయారవుతున్నది.విద్యాలయాల నిర్వహణ గాడి తప్పి అందని ద్రాక్షగా మారుతున్నది. అసలే మైనార్టీ పేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన మైనార్టీ గురుకులాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి.గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్‌ సర్కారు నిర్లక్ష్యం..అధికారుల పట్టింపులేమితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలైనా ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి.మైనార్టీ గురుకులాల్లో గత విద్యాసంవత్సరంలో చివర మార్చి,ఏప్రిల్‌,మే నెలతోపాటు ప్రస్తుత విద్యా సంవత్సరం జూలై నెలకు సంబంధించి డైట్‌ బిల్లులు పెండిరగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.మైనార్టీ గురుకులాల్లో ప్రైవేట్‌ వ్యక్తుల పెత్తనం ద్వారా ఆ ఇంత చదువు అటకెక్కిందనే వాదనలు వినిపిస్తున్నాయి.మైనార్టీ గురుకులా కేంద్ర కార్యాలయంలో ఉండి అకాడమిక్‌ హెడ్‌గా పెత్తనం చెలాయిస్తున్న శ్రీనివాస్‌పై ఉన్నతాధికారులు దృష్టిసారించి తగు చర్యలు తీసుకోవాల్సింది ఉద్యోగులు,ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS