Monday, November 25, 2024
spot_img

బాలిక సాధికారతతో ప్రగతిశీల సమాజం

Must Read
  • బీబీజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున్ రెడ్డి

ప్రగతి శీల సమాజానికి బాలిక సాధికారత అవసరం ఉందని బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ (బీబీజీ) ఎంవీ చైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు.శుక్రవారం జన్మదినాన్ని పురస్కరించుకొని బేగంపేటలోని దేవనార్ బ్లైండ్ స్కూల్‌లో ‘ప్రేరణ’ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బాలికలు తమ సామర్థ్యాలను నిరూపించుకుంటున్నారని చెప్పారు.సరైన అవకాశాలు,వనరులు అందించినప్పుడు ఇంకా రాణిస్తారని అన్నారు.భారతదేశంలో అనేక ప్రాంతాలలో బాలికలకు విద్యపై హక్కు ఉన్నప్పటికి,విద్య అందుబాటులో లేదని తెలిపారు.ఈ ముఖ్యమైన సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా బీబీజీ బంగారు తల్లి గ్రామీణ,మారుమూల ప్రాంతాల్లో విద్య ద్వారా బాలికలకు సాధికారత కల్పించడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు.బంగారు తల్లి లక్ష్యం ప్రతిష్టాత్మకమైనదన్నారు.2040 నాటికి రెండు మిలియన్ల బాలికలకు విద్య ద్వారా సాధికారత కల్పించనున్నామని చెప్పారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని సుమారు 170,000 మంది బాలికల జీవితాలను తన కార్యక్రమాల ద్వారా సానుకూలంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు.

Latest News

రూ.27 కోట్లతో రిషబ్ పంత్‎‎ని సొంతం చేసుకున్న లక్నో

ఐపీఎల్ 2025 మెగా వేలం ఆదివారం ప్రారంభమైంది. మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. లక్నో టీం పంత్‎ను...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS