Thursday, November 21, 2024
spot_img

బోగస్ ఓటా.. ఇక జైలే..

Must Read
  • హైదరాబాద్ లో ఎంఐఎం, బీజేపీ మధ్యే పోటీ
  • కాంగ్రెస్, బీఆర్ఎస్‌ డమ్మీ క్యాండెట్స్
  • మొత్తం 1,943 పోలింగ్ బూత్ లు
  • ఒక్కొక్క బూత్ కు ఒక్కో ఏజెంట్ ఏర్పాటు
  • అనుమానం వస్తే ప్రిసిడింగ్, రిటర్నింగ్ అధికారికీ ఫిర్యాదు
  • ఎవరైనా దొంగఓటుకు ప్రయత్నిస్తే అరెస్ట్
  • ఓల్డ్ సిటీపై అధిష్టానం స్పెషల్ ఫోకస్
  • హైదరాబాద్ పరిధిలో 7నియోజకవర్గాలు
  • మలక్‌పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పూరా, యాకుత్ పురా
  • ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న ఈసీ

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం తెలంగాణపై దృష్టిసారిస్తుంది. గత లోక్ సభ ఎన్నికల్లో 4నలుగురు ఎంపీలు గెలువడంతో ఈసారి దాన్ని రెట్టింపు కన్నా ఎక్కువగా అనగా డబుల్ డిజిట్ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ పై ఎక్కువ నజర్ పెట్టింది. ఎంఐఎం అడ్డాగా ఉన్న ఈ స్థానంలో కాషాయ జెండా ఎగురవేయాలనే దృఢ నిశ్చయంతో ఉంది. వరుసగా 9సార్లు ఎంపీగా పాలిస్తున్న ఓవైసీ కుటుంబం పీడ విరగొట్టాలనే ఉద్దేశ్యంతో భారతీయ జనతా పార్టీ ఏమాత్రం రాజకీయ అనుభవం లేని మాధవీలతని రంగంలోకి దింపి సంచలనానికి తెరదించింది. ఓల్డ్ సిటీ లో ముస్లింలు అడ్డా కాగా పాతబస్తీలో స్వచ్చంద సంస్థ, ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసే ఆమెను బరిలో నిలిపి అసదుద్దీన్ కు చెక్ పెట్టాలని యోచిస్తుంది. ఇక అధికార కాంగ్రెస్, గతంలో ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు డమ్మీ క్యాండెట్లను పోటీలో ఉంచి పరోక్షంగా అసదుద్దీన్ కు సాయం చేస్తున్నారు. అయితే ఇక మిగిలింది బీజేపీ, ఎంఐఎం మధ్యనే పోటీ. భాజపా కు అక్కడ ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ ఎన్నడూ బూత్ లెవల్ స్థాయిలో ప్లాన్ చేయకుండా ఉండడం… ఓటర్లను పోలింగ్ కు తీసుకెళ్లి ఓటు వేయించుకునే పరిస్థితి లేకుండే. అయితే పోలింగ్ బూత్ లో ఏజెంట్లు లేకపోవడం.. డివిజన్ల వారీగా ఏజెంట్లు లేకపోవడం వల్లే కమలం పార్టీకి అన్యాయం జ‌రిగింద‌ని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పాతబస్తీలో ఎంఐఎం వరుస గెలుపులకు బోగ‌స్ ఓట్లే కారణమని వాటిని అరికడితే బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకని పలువురు అభిప్రాయపడుతున్నారు.

నకిలీ ఓట్లకు మారుపేరు హైదరాబాద్
పాత బస్తీ అంటే భోగస్ ఓట్లకు మారుపేరు అని అందరికీ తెలుసు. ఒక్కో ఇంట్లో 100కు పైగా ఓట్లు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. గతంలో ఇలాంటి ఘటనలు అనేకం చూశాం. హైదరాబాద్ నగరంలో భారీగా బోగస్ ఓట్లు ఎన్నికల సంఘం తొలగించింది. ఇప్పటివరకు ఐదు లక్షలకుపైగా నకిలీ ఓట్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికారులు తీసివేసినట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలో భారీగా బోగస్ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదులు అందడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఇందులో భాగంగా కొంతమంది దొంగ ఓటర్లను గుర్తించింది. హైదరాబాద్ నగరంలో 54,259 నకిలీ ఓట్లు, చనిపోయినవారు 47 వేలు, 4,39,801 ఇండ్లు మారిన వారి ఓట్లు ఏరివేసినట్లు తెలిసింది. నకిలీ ఓట్లలో అత్యధికంగా మైనార్టీ ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల అధికారులు గుర్తించారు. పాతబస్తీలోని ఎంఐఎం ప్రభావిత ప్రాంతాల్లో అధికంగా భోగస్ ఓట్లను తొలగించినట్లు తెలిసింది. పాతబస్తీలో దొంగ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందడంతో దీనిని ఈసీ సీరియస్ గా తీసుకొని దాదాపు భోగస్ ఓట్లను తొలగించింది.

ఓల్డ్ సిటీలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్న బీజేపీ
ఇప్పుడున్న పరిస్థితిలో నకిలీ ఓట్లను ఈసీ తొలగించింది కాబట్టి.. అసలైన ఓటర్లను మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేలా కాషాయ పార్టీ హైకమాండ్ ప్లాన్ చేస్తుంది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిల్లో డివిజన్లు, పోలింగ్ బూత్ లను సపరేట్ చేస్తూ ఆయా కేంద్రాల్లో ఏజెంట్ల‌ను ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ సారి ఏ ఒక్క దొంగ ఓటు పడకుండా చూడాలని కమలం పార్టీ పావులు కదుపుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మలక్‌పేట -300, కార్వాన్ -310, గోషామహల్ -235, చార్మినార్ -198, చాంద్రాయణగుట్ట -305, బహదూర్‌పూరా -263, యాకుత్ పురా -332 పోలింగ్ బూత్ లు ఉన్నాయి. వాటిపైనా డివిజన్లకు ఇంఛార్జీలను నియమించింది. ఆయా నియోజకవర్గాలకు మొత్తం 1,943 పోలింగ్ బూత్ లు ఉన్నాయి. ఒక్కో పోలింగ్ బూత్ కు ఒక్కో ఏజెంట్ చొప్పున పార్టీ క్యాండెట్స్ ను కేటాయించింది. ఇప్పటికే వారందరికీ ట్రైనింగ్ కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఏ పోలింగ్ లో ఎవరైనా దొంగ ఓటు వేసేందుకు ప్రయత్నిస్తే వారిపై వెంటనే ప్రిసిడింగ్, రిటర్నింగ్, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసి.. పోలీసులను పిలిపించి వెంటనే అరెస్ట్ చేసేలా పోలింగ్ ఏజెంట్ కు ట్రైన్ చేస్తున్నారు.

మరోవైపు ఈ సారి రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. పోలీంగ్ కేంద్రాలపై ముఖ్యంగా నజర్ పెట్టింది. సీసీ కెమెరాల ద్వారా నిఘా నీడలో ఎన్నికలు జరిగేలా చూస్తోంది. అల్లర్లు కాకుండా ఉండేందుకు హైదరాబాద్ లో పోలీసు బలగాలను రంగంలోకి దింపింది. పాతబస్తీలోని పోలింగ్ కేంద్రాల వద్ద టైట్ సెక్యూరిటీ పెడ్తుంది. ఓవైపు ఈసీ, మరోవైపు భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రయత్నంలో ఎంఐఎం పార్టీకి లాభమా, నష్టమా… ఈసారి కాషాయ పార్టీ చేస్తున్న స్కెచ్ ఎంతవరకు లాభిస్తోంది. హైదరాబాద్ అడ్డా, ఎంఐఎం గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తుందా చూడాలి.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS