రాష్ట్రంలో గంజాయి,ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీ గురువారం సచివాలయంలో తొలి సమావేశం నిర్వహించింది.ఈ సమావేశంలో పలు కీలక అంశాల పై సమావేశం నిర్వహించారు.రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న గంజాయి,ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది.రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన ఏర్పాటైన ఈ మంత్రివర్గ ఉప సంఘంలో రాష్ట్ర మానవ వరుల అభివృద్ది,ఐటి శాఖ మంత్రి నారా లోకేష్,రాష్ట్ర గనులు మరియు భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంధ్ర,రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్,రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు.