
బెదిరింపులకు వెరవలేదు..!
అదిలింపులకు అదరలేదు..!
అధికారానికి తలవంచలేదు..!
దమ్ము చూపింది..!
దుమ్ము రేపింది..!
అక్రమార్కులు… అరాచకులు…
అధికార అండతో వనరులను దోచుకున్న వారిని వదలలేదు…
నిక్కచ్చిగా ప్రపంచానికి చూపింది..!
నిర్భయంగా అక్షర రూపంలో ప్రజల ముందు పెట్టింది..!
నిలదీసి కడిగి పారేసింది..!
అక్షర ఆయుధంతో ధర్మ రక్షణకై పోరాడుతోంది…
Aadab news… నిఖార్సైన ప్రజా మీడియా…!
అధికార మదంతో అరాచక అవినీతితో మైనింగ్ మాఫియా గా మారి అందినంత దోచుకున్న గూడెం బ్రదర్స్ అక్రమాలను పరిశోధనాత్మక కథనాలతో ప్రజలముందు పెట్టింది aadab news…
AADAB వెలుగులోకి తెచ్చిన అక్రమాల ఆధారంగా నేడు జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) రంగంలోకి దిగింది… గూడెం బ్రదర్స్ వ్యవహారాలను శోధిస్తోంది..
గురువారం తొలిసారిగా గూడెం మహిపాల్ రెడ్డి అతని సోదరుడు, బందువుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది ఈడీ అధికారుల బృందం..!