అన్నపూర్ణగా వెలుగొందిన నాదేశాన్ని అప్పుల పాలు చేయకండి..
నా తెలంగాణ కోటి రతనాల వీణ..
కారాదు..?? దుర్భిక్ష కోన..!!
కేంద్ర,రాష్ట్రాల బడ్జెట్లు చుస్తే ఘనం..
ప్రయోజనాలే ప్రశ్నార్థకం..?
రాజకీయ మైలేజ్ కోసం బురద జల్లుకునే డ్రామాలు చూస్తుంటే..
నేతల నోట నిజాలు ఎండమావులేనా
బడ్జెట్లో నిధులు కేటాయింపు పార్టీల స్వార్థ రాజకీయ చదరంగం కానే కాదు..
అభివృద్ధి అనేది ప్రజల ఆకాంక్ష..నిప్పులాంటి నిజాలు దాస్తే
కీలెరిగి వాటా పెడతారు సుమా..
- మేదాజి