- హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
- మార్చి 5 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు
- వివరాలు వెల్లడించిన ఇంటర్‌బోర్డు
తెలంగాణలో మార్చి 5 నుంచి ఇంటర్(INTER) వార్షిక పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఇంటర్ బోర్డు అధికారులు వెబ్‌సైట్‌లో ఉంచారు. విద్యార్థులు తమ ఎస్ఎస్‌సీ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ, వివరాలను ఎంటర్ చేసి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. మార్చి 5న నుండి ఇంటర్ ప్రథమ పరీక్షలు ప్రారంభం అయ్యి.. 24వ తేదీకి ముగియనున్నాయి. ఇక సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 6న ప్రారంభమై.. 25 వరకు జరగనున్నాయి. అయితే ఈ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. అయితే ఈసారి రాష్ట్రంలో దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నట్లు తెలుస్తోంది.