- ఎసిబి వలలో ఒక సబ్ రిజిస్టర్,ఇద్దరు డాక్యుమెంట్ రైటర్లు
రూ.99,200, పలు డాక్యుమెంట్లు స్వాధీనం.
- 2007 పరిగి, 2018 మల్కాజిగిరి, 2024 లో సూర్యాపేట లో ఏసిపికి పాటుపడ్డ సురేందర్ నాయక్.నల్గొండ డి.ఎస్.పి ఆధ్వర్యంలో తనిఖీలు.
గతంలో రెండుసార్లు పట్టుబడ్డ ఏమాత్రం అవినీతి తగ్గించకుండా, తన రేంజి కి తగ్గట్టు, గజానికి 100 నుంచి 200 అక్రమంగా వసూలు చేస్తూ,ప్లాట్ అయితే లక్ష పైగా లంచం డిమాండ్ చేస్తూ అక్రమ సంపాదన ద్యేయంగా పనిచేస్తున్న సూర్యాపట సబ్ రిజిస్టర్ బానోతు సురేందర్ నాయక్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నల్గొండ ఏసీబీ డిఎస్పి జగదీష్ చంద్ర ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం పై దాడులు నిర్వహించి డాక్యుమెంట్ రైటర్ శ్రీనివాస్ దగ్గర నుండి రూ.99,200 రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సూర్యాపేట పట్టణానికి చెందిన ఎం వెంకటేశ్వర్లు తన కూతురు మానస కు గిఫ్టు, 1080 చదరపు గజాలు ఓపెన్ ప్లాట్, మేడిపల్లి రవి రాజు కు విక్రయం (160 గజాలు) కింద కొంత భూమిని రిజిస్ట్రేషన్ చేయడం కోసం గజానికి వంద రూపాయల చొప్పున లంచం డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. నమ్మ నమ్మదగిన సమాచారం మేరకు ఏసీ వ్యాధికారులు ఇద్దరు మధ్యవర్తుల ద్వారా డాక్యుమెంట్ రైటర్ లు అయినా కల్లూరి శ్రీనివాస్ (ఏ 2), తంగేళ్ల వెంకటరెడ్డి (ఏ 3) లకు, భూమి రిజిస్ట్రేషన్ దారుడు వెంకటేశ్వర్లు డబ్బులు ఇస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డాక్యుమెంట్ కార్యాలయంలో రూ. 99,200 తో పాటు డాక్యుమెంట్లతో కూడిన ఒక బ్యాగు ను కూడా అధికారులు స్వాధీనపరుచుకున్నారు. అనంతరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సుమారు నాలుగు గంటలపాటు విస్తృతంగా శోధన జరిపి పలు రికార్డులను డాక్యుమెంట్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు.
అలాగే రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వ్యక్తులను, డాక్యుమెంట్ రైటర్లను కూడా విచారించారు. సూర్యాపేట సబ్ రిజిస్టర్ సురేందర్ నాయక్ 2007 లో పరిగి,2018 మల్కాజిగిరి లో పట్టుబడగా,సోమవారం సూర్యాపేట లో పట్టుబడ్డారు. గతంలోనే రెండుసార్ల ఏసిబి ట్రాప్ అయ్యాడు కాబట్టి, రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వ్యక్తుల నుండి నేరుగా డబ్బులు తీసుకోకుండా డాక్యుమెంట్ రైటర్లకు సైగల ద్వారా చెప్పి వారి ద్వారా డబ్బులు వత్తుల పాల్పడుతున్నట్లు అధికారులు తెలిపారు.అరెస్టయినా ఏ1, ఏ2, ఏ3 లను అరెస్టు చేసి ఏసీబీ నాంపల్లి కోర్టులో హాజరు పడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు విజ్ఞప్తి.. ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేసినట్లయితే ఏసిబి టోల్ ఫ్రీ నెంబర్ 10641 సంప్రదించాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లు గోపికంగా ఉంచుతామని అన్నారు. తనిఖీల్లో నల్గొండ రేంజ్ ఇన్స్పెక్టర్లు రామారావు వెంకటరావు, ఎసిబి సిబ్బంది తదితరులు ఉన్నారు.