మత్తుమందు అమ్ముతున్న నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్దనుంచి ఏం.డీ.ఏం.ఏ, మత్తు సరుకును స్వాధీనం చేసుకున్న సంఘటన హైదరాబాద్, పాతబస్తీ కంచన్‌బాగ్ ఠాణా పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. నగర సీపీ సివి ఆనంద్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ సుధీంద్ర, జీ.ఎస్.డానియల్, ఇన్స్‌స్పెక్టర్ వెంకటరాములు కంచన్‌బాగ్ ఠాణా ఇన్స్పెక్టర్ శేఖర్‌రెడ్డితో కలిసి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.
హైదరాబాద్ బంజారాహీల్స్ బస్తీకి చెందిన మహ్మద్ ఇమ్రాన్, గతకొన్ని రోజులుగా చెడు వ్యసనాలకు అలవాటు పడి, తన చదువును 05 తరగతిలోనే ఆపేసి తప్పుదోవా పట్టి, గంజాయి సేవించడం అలవాటు చేసుకున్నాడాని తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు మహ్మద్ ఇమ్రాన్ ను మానసిక చికిత్స కేంద్రంలో చేర్పించి చిక్సిత అందించారని అన్నారు. రిహాబ్‌లేషన్ సెంటర్లో ఉంటూ కారు డ్రైవింగ్ నేర్చుకుంటూ, ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న క్రమంలో డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులతో పరిచయం ఏర్పడి, వారి వద్ద నుంచి గంజాయి, హాష్ అయిల్ ను కొనుగోలు చేసి అమ్మడం ప్రారంభించడాని వెల్లడించారు. దీంతో మహ్మద్ ఇమ్రాన్‌ను నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారని అన్నారు.
మే నెలలో బెయిల్ పై బయటకు వచ్చి టోలిచౌక్ లో నివాసం ఉంటున్నాడని తెలిపారు. అనంతరం ఎలాగైనా డబ్బు సంపందించాలనే బలమైన కోరికతో బెంగుళూరు వెళ్ళి మత్తుమందులు అమ్మే నందకుమార్ ఆలీయాస్ లల్లూ, కే. నవీన్ కుమార్ లను కలిసి హైదరాబాద్ నగరంలో మత్తు మందుకు అధిక డిమాండ్ ఉందని చెప్పి, వాట్సప్ ద్వారా వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని మత్తు మందును సఫ్లై చేస్తున్నాడని తెలిపారు.శుక్రవారం పాతబస్తీ పరిధిలో మత్తు మందు విక్రయిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు దాడులు నిర్వహించి చందానగర్‌కు చెందిన కే.నవీన్ (24), అంతరాష్ట్ర నిందితుడు నందకుమార్ (25) , ఇమ్రాన్, తదితరులను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. నిందితుల వద్ద నుండి 80గ్రాముల ఏండీఏంఏ, 10 ఎల్.ఎస్.డీ బోల్డ్స్, 03 మొబైల్ ఫోన్లతో పాటు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. దాదాపు రూ.13 లక్షల సరుకును స్వాధీనం చేసుకుని నిందితులను న్యాయాస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించడం జరిగిందని అన్నారు. చాకచాక్యంగా నిందితులను పట్టుకున్న సిబ్బందిని ప్రశంస పత్రాలను అందజేశారు.