Saturday, September 6, 2025
spot_img

కుంభమేళాలో సన్యాసం తీసుకున్న నటి

Must Read

అలహాబాద్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మాజీ నటి మమతా కులకర్ణి సన్యాసం తీసుకుంది. జనవరి 24న మహాకుంభమేళాకు వెళ్లిన ఆమె మహామండలేశ్వర్‌ గా మారుతున్నట్లు ప్రకటించింది. తన జీవితం దేవుడికి అంకింతం ఇస్తూ.. ఇక నుంచి ఆధ్యాత్మిక బాటలో ప్రయాణించాలి అనుకుంటున్నా అంటూ చెప్పుకోచ్చింది. ఈ సందర్భంగా తన పేరును శ్రీ యామై మమత నందగిరిగా మార్చుకుంది. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో ఒకప్పుడు అగ్రతారగా వెలుగు వెలిగింది మమత కులకర్ణి. తాను నటించిన కరణ్‌ అర్జున్‌, క్రాంతివీర్‌, సబ్‌సే బడా ఖిలాడి, కిస్మత్‌, నజీబ్‌ సూపర్‌ హిట్‌ కావడంతో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కూడా ప్రేమ శిఖరంతో పాటు మోహన్‌ బాబు హీరోగా వచ్చిన దొంగా పోలీస్‌ చిత్రంలో నటించింది ఈ భామ. అయితే సడన్‌గా తాను నటనకు గుడ్‌ బై చెబుతున్నట్లు ప్రకటించి అందరిని షాక్‌కి గురిచేసింది. ఇక 20 ఏండ్ల క్రితం నటనను వదిలేసి విదేశాల్లో వెళ్లి స్థిరపడిరది మమత.. తాజాగా మహకుంభమేళలో కనపడడం.. సన్యాసం తీసుకోవడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారాయి.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This