- బుర్కా వేసుకుని వచ్చిన హేమ
- ఆశ్చర్యపోయిన CCB పోలీసులు…
- ఊహించని విధంగా హేమ బుర్ఖా ధరించి పోలీసుల విచారణ కు హాజరయ్యారు..
- విచారణ అనంతరం హేమ ను అరెస్టు చేసినట్లు బెంగళూర్ క్రైం బ్రాంచ్ పోలీసులు ధృవీకరించారు.
తక్కువ సమయంలోనే సుమారు 400 చిత్రాలకు పైగా నటించిన హేమ ఇప్పటికే పలు సినిమాలతో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
కెరియర్ పరంగా ఈమె ఇండస్ట్రీలో ఇలా నిలదొక్కుకోవడానికి గల కారణం ఆమెకు ఎన్నో సహాయ సహకారాలను అందిస్తూ తనని ప్రోత్సహిస్తున్న తన భర్త అని చెప్పవచ్చు. మరి హేమ భర్త ఎవరు అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
హేమ భర్త ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి ఆయన ఒక ప్రముఖ కెమెరామెన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. హేమ భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్. ఈయన కూడా చిత్ర పరిశ్రమలో కెమెరా మెన్ గా పనిచేస్తున్నారు.
జాన్ S.D.లాల్ తనయుడే సయ్యద్ జాన్ అహ్మద్ హేమాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఒక కూతురు కూడా ఉంది. ఇలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత హేమను పలు సినిమాలలో నటించడానికి తన భర్త సహకారం ఎంతో ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం హేమ ఈ స్థాయిలో ఉందంటే అందుకు 100% తన భర్త సహకారమేనని పలుసార్లు తన భర్త గురించి వెల్లడించారు.ఇక సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్న హేమ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలన్నింటినీ అభిమానులతో పంచుకుంటున్నారు.
రేవ్ పార్టీ కేసులో విచారణ సందర్భంగా నటి హేమ బుర్ఖా తో రావడం అందరికీ ఆసక్తి కలిగించింది… మీడియా కంట పడకుండా తప్పుదోవ పట్టించుకునేందుకే ఆమె అలా వచ్చినట్లుగా అందరూ అనుకుంటున్నారు. అయితే ఆమె భర్త ముస్లిం కావడంతోనే ఆమె విచారణకు బుర్ఖా లో వచ్చారని ఆమె అభిమానులు వాదిస్తున్నారు..
మొత్తానికి ఆమె భర్త ముస్లిం కావడం వల్ల అవసరానికి బుర్ఖా ఇలా కలిసి వచ్చిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..
మొత్తం మీద హేమ బుర్ఖా ధరించి విచారణ కు రావడం అరెస్ట్ ను మించిన హాట్ టాపిక్ గా మారింది