Wednesday, December 18, 2024
spot_img

అదనపు డీసీపీలకు పదోన్నతులు

Must Read

రాష్ట్రంలో 9 మంది అడిషనల్‌ డీసీపీ(ADDITIONAL DCP)లకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అలాగే ముగ్గురు డీసీపీలను బదిలీ చేసింది. ఈ మేరకు పదోన్నతులు కల్పిస్తూ హోం శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రవి గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాచకొండ డీసీపీ (స్పెషల్‌ బ్రాంచ్‌) పి.కరుణాకర్‌ను డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆయన స్థానంలో సైబరాబాద్‌ అదనపు డీసీపీ(క్రైమ్స్‌-I)కు పదోన్నతి కల్పించారు. రాచకొండ డీసీపీ(ట్రాఫిక్‌) కె.మనోహర్‌ను రాచకొండ డీసీపీ (రోడ్‌ సేఫ్టీ)కి బదిలీ చేశారు. మాదాపూర్‌ డీసీపీ(ఎస్‌వోటీ) డి.శ్రీనివాస్‌ను మేడ్చల్‌ జోన్‌ డీసీపీ(ఎస్‌వోటీ)గా బదిలీ చేశారు.

పదోన్నతి పొందిన అదనపు డీసీపీలు వీళ్లే..
కె.గుణశేఖర్‌ – మేడ్చల్‌ డీసీపీ (ట్రాఫిక్‌)
జి.నరసింహారెడ్డి – రాచకొండ డీసీపీ ( స్పెషల్‌ బ్రాంచ్‌)
ఎస్‌.మల్లారెడ్డి – రాచకొండ డీసీపీ (ట్రాఫిక్‌)
మద్దిపాటి శ్రీనివాస రావు – సీఐడీ ఎస్పీ
పి.శోభన్‌ కుమార్‌ – మాదాపూర్‌ డీసీపీ(ఎస్‌వోటీ)
టి. సాయి మనోహర్‌ – మాదాపూర్‌ డీసీపీ (ట్రాఫిక్‌)
డి.రమేశ్‌ – ఎస్పీ (ఇంటెలిజెన్స్‌)
జే.చెన్నయ్య – ఐసీసీసీ హైదరాబాద్‌ ఎస్పీ
పి.విజయ్‌కుమార్‌ – సీఐడీ ఎస్పీ
కె.మనోహర్‌ – రాచకొండ డీసీపీ (రోడ్‌ సేఫ్టీ)
డి.శ్రీనివాస్‌ – మేడ్చల్‌ డీసీపీ (ఎస్‌వోటీ)
పి.కరుణాకర్‌ -(డీజీపీకి రిపోర్ట్‌)

Latest News

ద‌ర్జాగా గుడి భూమి కబ్జా..

రాజేంద్రనగర్ మండలంలోని రాంబాగ్ లో సర్వే నెం. 523లో భూమి మాయం శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని పక్కనే ఉన్న స్థ‌లం స్వాహా ప్రభుత్వం నుంచి అనుమతులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS