బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా మొదలైన రెండవ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా టాపార్డర్ నిరాశ పరిచింది. ఓపెనర్ కేఏల్ రాహుల్ 37, శూబ్మాన్ గిల్ 31 పరుగులు చేయగా, యశస్వి జైస్వాల్ 0, రోహిత్ శర్మ 03, విరాట్ కోహ్లీ 07 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యారు. దీంతో భారత్ 05 వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేసింది.
ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ 03 వికెట్లు, స్కాట్ బోలాండ్ 02 వికెట్లు తీశారు. ఆట 30 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 100/5గా ఉంది.