Friday, November 22, 2024
spot_img

ఒక్క పూటయితే ఓకే

Must Read
  • టీచర్ల ట్రాన్స్ ఫర్స్ లో వింత పోకడ
  • ఒంటిపూట బడి ఉన్న పాఠశాలకే పోటీ
  • అక్కడికే బదిలీ చేయాలంటూ పట్టు
  • ఒంటిపూట బడులకే ఫుల్ గిరాకీ
  • ఆదర్శ టీచర్లు కూడా అటువైపే మొగ్గు
  • గ‌త 10 సం.లుగా ప‌ట్టించుకోని విద్యాశాఖ‌
  • ఒంటిపూట బ‌డుల‌ను రెగ్యూల‌ర్ స్కూల్‌గా ఏర్పాటు చేయాల‌ని డిమాండ్‌

తెలంగాణలో ప్రస్తుతం టీచర్ల పదోన్నతులు, ట్రాన్స్ ఫర్స్ కాలం నడుస్తుంది. ఎక్కడ చూసిన ఒకటే చర్చ జరుగుతోంది. పంతుళ్లు అందరూ ఒక్క పూట బడి ఉన్నచోటకే బదిలీ కావాలని పట్టుబడుతుండడం గమనార్హం. ఒక్క పూట అయితేనే ఓకే లేదంటే.. కష్టం అనే మాట వినబడుతోంది. ‘చదువు రాక ముందు కాకరకాయ… చదువు వచ్చాక కీకరకాయ’ అన్నట్టు ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చే వరకు పుస్తకాల పురుగులా చదువుతారు పంతుళ్లు.. జాబ్ వచ్చిన తర్వాత అంతా మరిచిపోతారు. స్కూల్ కు ఉదయం 10గం.ల తర్వాత వచ్చి మధ్యాహ్నాం బువ్వతినే వేళకు తిరిగి వెళ్లిపోతారు. పిల్లలకు పాఠాలు చెప్పేది లేదు.. వాళ్లకు ఓ అక్షరం ముక్క విద్య నేర్పేది లేదు. ఇదంతా మాకెందుకు నెలనెలా మా జీతం మాకు వస్తే చాలు అన్నట్టుగా ఉంటారు.

ఒక్క పూట బడులకే ప్రాధాన్యత :


చాలా కాలం తర్వాత రాష్ట్రంలో ఉపాధ్యాయ ట్రాన్స్ ఫర్స్ జరుగుతున్నాయి. అయితే అంతా ఒంటి పూట బడి ఉన్నచోటుకే అధిక ప్రాధాన్యత ఇస్తుండడం గమనార్హం. తెలంగాణలో కొన్ని స్కూల్స్ త‌ర‌గ‌తి గ‌దులు లేక‌పోవ‌డంతో షిఫ్ట్ వైజ్ గా నడుస్తున్నాయి. హైస్కూల్ తోపాటు జూనియర్ కాలేజ్ ఉండడం రెండూ ఒకే చోట నడవాల్సిన పరిస్థితి. చాలినన్ని తరగతి గదులు లేకపోవడం మూలంగా షిప్ట్ వైజ్ గా అక్కడే స్కూల్, ఇంటర్ క్లాసులు నడిపిస్తున్నరు. అలాంటి చోట దాదాపు ఒక్క పూట తరగతులు నిర్వహిస్తున్నారు. ఓ పూట బడి, మరో పూట కాలేజీ ఉంటుంది. అయితే అక్కడ పనిచేస్తే ఒకే పూట డ్యూటీ ఉంటుందనే ఆశతో టీచర్లు ప్రిఫర్ చేస్తున్నారు. ఎలాగైనా అటే ట్రాన్స్ ఫర్ చేయించుకోవాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు.

ఆఫ్ డే స్కూల్స్ కు ఫుల్ గిరాకీ


తెలంగాణలో ప్రభుత్వ పంతుళ్లు అంతా ప్రస్తుతం జేబులకు ఛిల్లులు పెట్టుకుంటున్నారు. ఫైరవీ చేయించుకునేందుకు ఖర్చు చేస్తున్నారు. ఒక్క పూట నడిచే బడిలో పోస్టింగ్ కోసం ఎంత పెట్టినా పర్లేదు అనికాడికి వచ్చిర్రు. ఈ నేపథ్యంలో ఫైరవీకారులకు కాసుల వర్షం కురుస్తోంది. ఎంత మంది వస్తే అంత డిమాండ్ పెరుగుతుంది. రాష్ట్రంలో తక్కువగా ఉన్న షిఫ్ట్ స్కూల్ కు బదిలీ కావాలంటూ ఎంత డబ్బు కావాలని బేరం ఆడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. విద్యాశాఖలో పనిచేసే పై ఆఫీసర్లకు లంచాలు పెట్టిమరీ పోస్టింగ్స్ ఇప్పిస్తున్న ఫైరవీకారులు పంతుళ్ల వద్ద నుంచి అంతకు మూడంతలు వసూలు చేసుకుంటున్నారు. ఐదారు గంటలు పనిచేస్తే డ్యూటీ అయిపోతుంది.. ఆ తర్వాత ఇంటికెళ్లి ఏ పనైనా చేసుకోవచ్చనే కుతుహలంతో కొందరూ భారీ ఎత్తున డ‌బ్బులు పెట్టి ట్రాన్స్ ఫర్స్ చేయించుకుంటున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.

స‌మ‌గ్ర శిక్ష ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో అద‌న‌పు గ‌దుల నిర్మాణాలు జ‌రుగుతుంటాయి. కానీ, ఒంటిపూట పాఠ‌శాల‌ల‌కు పూర్తి స్థాయిలో భ‌వ‌న నిర్మాణ‌లు చేసి అద‌న‌పు త‌ర‌గ‌తి గ‌దులు నిర్మించి రెగ్యూల‌ర్ పాఠ‌శాల‌లు నిర్వ‌హించ‌క‌పోడం శోచ‌నీయం.. ఈ దుస్థితి గ‌త ప‌ది సంవ‌త్స‌రాల నుండి కొన‌సాగుతున్న తెలంగాణ రాష్ట్రంలో ప‌ట్టించుకోనే నాథుడే క‌రువైయ్యారు. అన్ని మౌళిక వ‌స‌తుల‌తో, నాణ్య‌త ప్ర‌మాణాల‌తో కూడుకున్న పాఠ‌శాల విద్య‌ను బ‌లోపేతం చేయ‌క‌పోవ‌డం బాధాక‌రం. ఇప్ప‌టికైనా ఒంటిపూట బ‌డుల‌ను రెగ్యూల‌ర్ స్కూల్‌గా అయ్యే విధంగా అద‌న‌పు త‌ర‌గ‌తి గదులు నిర్మాణాలు, అన్ని వ‌స‌తులు ఏర్పాటు చేయాల‌ని మేధావులు కోరుతున్నారు. ఇదంతా చూసినంక అయినా ప్రభుత్వం టీచర్ల ట్రాన్స్ ఫర్స్ పై అలెర్ట్ కావాల్సి ఉంది. గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న విద్యార్థుల సంఖ్య, అక్కడ ఏ సబ్జెక్ట్ అవసరం.. పిల్లల డెవలప్ మెంట్ గురించి, అవసరమైన ఫ్యాకల్టీ వంటి వాటిపై విద్యాశాఖ దృష్టిపెట్టి ఎలాంటి ఫైరవీలు, ఒంటిపూట బడులకు టీచర్లు ప్రిఫర్ చేయకుండా బదిలీలలో అవకతవకలు జరుగకుండా చూడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS