- సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ హెచ్.ఐ.సీ.సీ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఏఐ సదస్సులో ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ ఐబీఎం వైస్ ప్రెసిడెంట్ డానియెలా కాంబ్ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు.అనంతరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భవిష్యత్తు,నూతన ఆవిష్కరణల అన్వేషణ తదితర అంశాలపై చర్చించారు.తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల ప్రాంగణంలో అధునాతన ఏఐ సిటీని నిర్మిస్తోన్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.ఫ్యూచర్ సిటీని ఏఐ రాజధానిగా తీర్చిదిద్దాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికల పట్ల ఐబీఎం వైస్ ప్రెసిడెంట్ ఆసక్తి కనబరిచారు.సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు,ఉన్నతాధికారులు,ఐబీఎం ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,నూతన ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని తెలిపారు.కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాయని అన్నారు.ప్రస్తుత కాలంలో ఏఐ అద్బుత ఆవిష్కరణ అని పేర్కొన్నారు.విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ నగరంలా ఏ నగరము కూడా సిద్ధంగా లేదని తెలిపారు.