స్పెయిన్ రాయబారి జువాన్ ఆంటోనియో మార్చ్ పుజోల్ శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన పలు కార్యక్రమాలపై జువాన్ ఆసక్తి కనబర్చారు.ముఖ్యంగా రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ,స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు.స్పెయిన్ దేశాన్ని సందర్శించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.ఈ సందర్భంగా జువాన్ రాసిన “మొమెన్టం” పుస్తకాన్ని అందజేశారు.