Sunday, December 22, 2024
spot_img

అమిత్‌ షా అంబేద్కర్‌ను అవమానపరిచారు..

Must Read
  • అసెంబ్లీ ముందు తెలంగాణ కాంగ్రస్‌ నేతల ధర్నా
  • తమకు దేవుడికన్నా ఎక్కువేనన్న పిసిసి చీఫ్‌

అంబేడ్కర్‌ను అవమానించిన కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షాను బర్తరఫ్‌ చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. పార్లమెంట్‌ లో అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. అమిత్‌ షా అంబేద్కర్‌ ను అవమానపరిచారని.. ఆయన వెంటనే రాజీనామా చెయ్యాలని డిమాండ్‌ చేస్తూ పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో అసెంబ్లీలోని గాంధీ విగ్రహం దగ్గర ఆందోళన చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు ఆందోళనలో పాల్గొన్నారు. అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్‌ ఈ ధర్నా చేస్తోంది. అంబేద్కర్‌ తమకు దేవుడు లెక్క అని, అమిత్‌ షా క్షమాపణలు చెప్పాలని పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ వ్యతిరేకి అమిత్‌ షాను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ నినాదాలు చేసింది.

పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ’మేము దేవుళ్లను ఆరాధిస్తాం. డా.బీఆర్‌ అంబేద్కర్‌ కూడా మాకు దేవుడు లెక్క. అంబేడ్కర్‌పై చేసిన వాఖ్యలు ప్రజల మనుసుని గాయపర్చాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మాటలు అగ్రవర్ణాల పోకడను గుర్తు చేసేలా ఉన్నాయి. అమిత్‌ షాను బర్థరఫ్‌ చేస్తే ప్రజల మనసుకు కలిగిన గాయానికి కొంత ఊరట కలిగినట్లు ఉంటుంది. వెంటనే ప్రధాని మోడీ స్పందించి అమిత్‌ షాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం అని పిసిసి చీఫ్‌ అన్నారు. ఈ ఆందోళనలో మంత్రి పొన్నంతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌ కుమార్‌,పలువురు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అంబేద్కర్‌.. అంబేద్కర్‌.. అంబేద్కర్‌ అని అనడం ఈ మధ్య ఫ్యాషన్‌ అయిపోయింది.. అంబేద్కర్‌ పేరు కంటే.. దేవుడి పేరు స్మరించినా స్వర్గానికి వెళ్లేవారు అంటూ రాజ్యసభలో అమిత్‌ చేసిన వ్యాఖ్యలు గత రెండు రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అంబేద్కర్‌ను నిండు సభలో అమిత్‌ షా అవమానించారని.. ఆయన వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. గురువారం కూడా పార్లమెంట్‌ భవనం ముందు కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమిలోని ఇతర పార్టీల ఎంపీల పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అంబేద్కర్‌ చిత్రపటాలను చేతిలో పట్టుకుని జై భీం.. జై జై భీం నినాదాలతో ఎంపీలు హోరెత్తించారు.

Latest News

పరిటాల రవి హత్య కేసులో నిందితుడు విడుదల

మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులు శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు.. కడప జైలు నుంచి నలుగురు, విశాఖ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS