Sunday, April 20, 2025
spot_img

చిన్నసారే సర్వం..!

Must Read
  • చందానగర్‌ సర్కిల్‌లో ఆయనే కీపిన్‌..!
  • 5 ఏళ్లుగా సర్కిల్‌లోనే తిష్ట..!
  • బదిలీ చేసినా వెళ్లరు..!
  • బిల్‌ కలెక్టర్‌గా జాయిన్‌ అయి.. ఎఎంసీగా ఎదిగిన వైనం
  • 50 శాతం డిమాండ్‌..
  • ఆయన చేతుల్లోనే ఎవరినైనా మ్యానేజ్‌ చేయగల్గే సత్తా ఆయన స్వంతం..
  • చందానగర్‌ సర్కిల్‌ ఎఎంసీ విజయ్‌ చిత్ర, విచిత్రాలు..

ఏ ప్రభుత్వ కార్యాలయాల్లోనైనా ఆ కార్యాలయ ఉన్నతాధికారిదే ఆజా మాయిషి ఉంటుంది. కానీ, చందానగర్‌ సర్కిల్‌లో మాత్రం పరి స్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ రెవన్యూ విభాగం లో అసిస్టెంట్‌ మున్సిపల్‌ అధికారిగా పనిచేస్తున్న విజయ్‌ అన్ని తానై సర్కిల్‌ ఆఫీస్‌లో చక్రం తిప్పుతుండడం విశేషం. మొదట బిల్‌ కలెక్టర్‌గా జాయిన్‌ అయిన విజయ్‌ ఆనాది కాలంలోనే అసిస్టెంట్‌ మున్నిపల్‌ అధికారి స్థాయికి ఎదిగారు. చందానగర్‌ సర్కిల్‌ లిమిట్స్‌లో మాదాపూర్‌, మియాపూర్‌ చాలా కీలకమైన ప్రాంతాలుగా ఉన్నాయి. ఈరెండు డివిజన్ల నుంచి పెద్ద మొత్తంలో రెవెన్యూ కలెక్షన్స్‌ వసూళ్లు అవుతుంటాయి. అయితే ఇక్కడే ఉన్నతాధికారులను మ్యానేజ్‌ చేసుకోల్గిన రెవెన్యూ ఎఎంసీ విజయ్‌ ఈ రెండు డివిజన్ల డిమాండ్లను తన చేతుల్లో పెట్టుకోవడం గమనార్హం. అంతేకాక దాదాపు సర్కిల్‌ పరిధిలోని 60 శాతం డిమాండ్‌పై విజయ్‌కే ఆజామాయిషీ ఉండడం విశేషం.

ఇక ఎఎంసీ విజయ్‌ చందానగర్‌ సర్కిల్‌ పరిధిలోని మెజార్టీ అంశాలను తన ఆధీనంలో ఉంచుకోవడం విస్మయం కల్గిస్తోంది. దాదాపు 5 నుంచి 7 విభాగాలు ఈయన పర్యవేక్షణలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆడ్మిన్‌, మ్యుటేషన్స్‌, స్టేషనరీ, ఆపరేటర్స్‌లకు ఇంఛార్జ్‌గా, ఎఎంసీ, ఎల్వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే సూపరింటెండెంట్‌ అంటే మ్యుటేషన్లు వరకు మాత్రమే చూసుకోవాలి.. కానీ, విజయ్‌ ఇన్నిపనులను చక్కబెడుతుండడమే ఆశ్చర్యకరంగా ఉంది. కీలకమైన విషయాల్లో ఈయన డీసీ మాటను కూడా బేఖాతర్‌ చేస్తారనే విమర్శలు ఉన్నాయి. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఇంతటి కీలకంగా సర్కిల్‌లో చక్రం తిప్పుతున్న ఎఎంసీ విజయ్‌పై ఉన్నతాధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.

Latest News

ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్.. చాలా ఆనందాన్ని ఇచ్చింది

అర్జున్ S/O వైజయంతి సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS