దేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటైపోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు.అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ రిజర్వేషన్ల గురించి చేసిన వ్యాఖ్యల పై అమిత్ షా స్పందించారు.దేశాన్ని విభజించే కుట్ర చేసే శక్తులతో నిలబడటం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.విదేశి వేదికల పై దేశ భద్రత,మనోభావాలను రాహుల్ దెబ్బతీస్తున్నారని విమర్శించారు.రిజర్వేషన్ వ్యతిరేక ముఖాన్ని మరోసారి రాహుల్ గాంధీ తెరపైకి తెచ్చారని,అతని మనసులో ఉన్న ఆలోచనలు బయటకు వచ్చాయని మండిపడ్డారు.బీజేపీ ఉన్నంత కాలం,రిజర్వేషన్లను ఎవరు రద్దు చేయలేరని తెలిపారు.